తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
● జలాశయాల నుంచి నీటిని
తరలించేలా ప్రణాళిక
సాక్షి, పార్వతీపురం మన్యం: రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ప్రజలకు రక్షిత నీటి సరఫరా కోసం పలు జలాశయాలను గుర్తించారు. జలాశయా ల నీటిని పథకానికి అనుసంధానించే ప్రాజెక్టు కు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిధిలోని తోటపల్లి, పెద్దగెడ్డ, మడ్డువలస రిజర్వాయర్లను గుర్తించారు. జిల్లాకు సంబంధించి పలు రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకుని 1,937 గ్రామాలకు వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అనుసంధానించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు రూ.1,432 కోట్ల వరకు వ్యయమవుతుందని భావిస్తున్నారు. వేసవిలోనూ కుళాయిల ద్వారా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా నదుల నుంచి నీటిని సేకరించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
నేటి నుంచి కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
పార్వతీపురంటౌన్: జూని యర్ కళాశాల విద్యార్థుల కు 4వ తేదీ నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి.మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు శుక్రవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం సాలూ రు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పథకాన్ని ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ కూడా కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. జిల్లాలోని 14 ప్రభుత్వ జూని యర్ కళాశాలలలో చదువుతున్న 5,905 మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజన పథకంలో ప్రయోజనం పొందనున్నారని చెప్పారు.
డీఎంహెచ్‌ఓగా భాస్కరరావు బాధ్యతల స్వీకరణ
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా డాక్టర్ ఎస్.భాస్కరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఈయన విజయనగరం డీఎంహెచ్‌ఓగా పనిచేశారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది ఆయనకు ఆరోగ్య కార్యాలయంలో పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని, జిల్లాకు మంచి గుర్తింపు తీసుకు వచ్చేలా కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. అనంతరం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో డీఐఓ డా.నారాయణరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.పద్మావతి, ప్రొగ్రాం అధికారులు డా.రఘు, డా.వినోద్, డా.విజయమోహన్, డా.శ్రీధర్, ఆఫీస్ సూపరింటెండెంట్ కామేశ్వరరావు, ఆరోగ్య కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
విజయనగరం క్రైమ్: స్టైపెండరీ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియమాకాలకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ పరీక్షల ప్రక్రి యను ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం ప్రారంభించారు. 550 మందికి 314 మహిళా అభ్య ర్థులు హాజరయ్యారు. దేహదారుఢ్య పరీక్షలను ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్ అధికారులు పర్యవేక్షించారు.
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందేందుకు నిరుద్యోగ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎన్‌టీఆర్‌సీఎస్‌డీ అండ్ ఈడబ్ల్యూ జిల్లా మేనేజర్ పి.విమల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. సూయింగ్ మెషిన్ ఆపరేటర్ (45 రోజులు), మగ్గం వర్క్ (30 రోజులు), బేకరీ ప్రొ డెక్ట్స్ (30 రోజులు) కోర్సులకు 8వ తరగతి విద్యార్హత ఉన్నవారు అర్హులన్నారు. అసిస్టెంట్ బ్యూటీ థెరిఫిస్ట్ (60 రోజులు) ఉపాధి కోర్సు కు 10 తరగతి కనీస విద్యార్హతగా పేర్కొన్నా రు. దరఖాస్తులను ఈ నె 10వ తేదీలోపు స్థానిక మహిళా ప్రాంగణానికి అందజేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment