ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు
● జిల్లాలో ఆరో తరగతిలో 360 సీట్లు భర్తీ ● ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయింపు
సీతంపేట:
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు గురుకులం రాష్ట్ర కార్యదర్శి సదా భార్గవి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాతపరీక్షలో ప్రతిభ కనబర్చినవారికి ప్రవేశాలు కల్పిస్తారు. 2025–26 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 28 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏల పరిధిలో 6 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. మెళియాపుట్టి, భామిని, అనసభద్ర, కొటికపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురంలలో ఉన్న పాఠశాలల్లో కో ఎడ్యుకేషన్‌లో బాలురు 30, బాలికలకు 30 చొప్పున సీట్లు కేటాయించారు. మొత్తం 360 సీట్లు భర్తీ చేయనున్నారు. విద్యాబోధన సీబీఎస్‌ఈ సిల బస్‌లో ఉంటుంది. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా రాతపరీక్షకు అర్హులే. ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదోతరగతి చదివిన వారు అర్హులు. 10 ఏళ్ల నుంచి 13 ఏళ్ల మధ్య వయ స్సు ఉన్నవారు అర్హులు.
మెరిట్ ఆధారంగా సీట్లు..
నిర్ధిష్ట రిజర్వేషన్ లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థికి సంబంధించిన జిల్లాలో ఏకలవ్య విద్యాసంస్థ లేకపోయినా సమీపంలో గల ఏకలవ్య గురుకుల పాఠశాలలో అప్‌లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, దివ్యాంగ విద్యార్థులైతే సంబంధిత పత్రం, స్టడీ సర్టిఫికేట్, పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం, జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్న వారి సర్టిఫికెట్ (తప్పనిసరికాదు), పాస్‌ఫొటోలు 2 దరఖాస్తుకు జతచేయాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష దాటకుండా ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసినప్పుడు ఐదు ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుంది.
రాతపరీక్ష ఇలా..
ప్రవేశ పరీక్ష వంద మార్కులకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. 25 ఫిబ్రవరి, 2025 ఉదయం 11.30 గంటలకు పెద్దమడి బాలురు, సీతంపేట బాలికల గురుకుల పాఠశాల, పి.కోనవలస, జీఎల్‌పురం ఈఎంఆర్‌ఎస్, భద్రగిరి గురుకలం, పార్వతీపురం ఎస్‌ఓఈ పాఠశాలలో రాత పరీక్ష ఉంటుంది. ప్రవేశ పరీక్షలో మెంటల్ ఎబిలిటీ 50, అర్థమెటిక్ 25, లాంగ్వేజ్ (తెలుగు) టెస్ట్ 25 మొత్తం 100 మార్కులు కేటాయించారు.
షెడ్యూల్..
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 22.01.2025
ఆఖరు తేదీ 19.02.2025
అడ్మిట్ కార్డు జారీ 22.02.2025
పరీక్ష తేదీ 25.02.2025
ప్రొవిజనల్ లిస్టు 15.03.2025
మార్కులు సాధించిన వారి
జాబితా ప్రదర్శన: 25.03.2025
Comments
Please login to add a commentAdd a comment