గురుదేవ సేవలు అభినందనీయం
శృంగవరపుకోట: గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అద్భుతం. ఆపన్నులకు ఆసరాగా నిలుస్తున్న గురుదేవ సంస్థ ఆదర్శం అని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కొత్తవలస మండలంలోని మంగళపాలెం గ్రామంలో గల గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు ఆధ్వర్యంలో నిర్మించిన డా.విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, బీజేపీ నేత డా.ఎస్.మల్లారెడ్డి, ఎన్‌టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఎగ్‌జిౖక్యూటివ్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment