టూరిజం ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలి
పాలకొండ: టూరిజం ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. సీతంపేట మండలంలోని అడలి వ్యూ పాయింట్ వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో గాయపడి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. టూరిజం ప్రాంతాలను ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్షణ చర్యలు లేకుండా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. దీనిపై కమిషన్ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్ కనపాక సూర్యప్రకాశ్ రావులు ఉన్నారు.
ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు
Comments
Please login to add a commentAdd a comment