కలాసీల వేతన కష్టాలు
చీపురుపల్లి: ఉదయం విధులకు వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పని చేస్తుంటే మాకు రావాల్సిన వేతనం మాత్రం అరకొరగానే వస్తోంది. మా కష్టాన్ని ఫుడ్ పార్క్ యాజమాన్యం దోచుకుంటోంది.. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల పేరుతో కొల్లగొడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గొడౌన్లలో పని చేసే కలాసీలకు వచ్చే వేతనం కూడా మాకు రావడం లేదు. ఆ గొడౌన్లలో విధులు నిర్వహిస్తున్న కలాసీలకు మాకు తేడా ఏంటి? దాదాపు ఏడెనిమిది సంవత్సరాలుగా విధులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాల మంజూరులో వివక్ష జరుగుతోందంటూ చీపురుపల్లి మండలంలోని పత్తికాయవలస సమీపంలో గల ఫుడ్ పార్క్ వద్ద కలాసీలు ఆందోళనకు దిగారు. ఫుడ్‌పార్క్ యాజమాన్యం న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వేతనాల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ మంగళవారం నిరసనకు దిగిన కలాసీలు ఫుడ్‌పార్క్‌లోకి వస్తున్న బియ్యం, మొక్కజొన్న లారీలను అడ్డుకున్నారు. ఫుడ్‌పార్క్ ప్రధాన గేటు వద్ద రాస్తారోకో నిర్వహించి ఎలాంటి వాహనాలు లోపలికి పంపించకుండా దాదాపు 150 మంది కలాసీలు నిరసన తెలిపారు. దీంతో మండలంలోని పత్తికాయవలస సమీపంలో ఉన్న ఫుడ్ పార్క్ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వెంకటాపురం వరకు భారీఎత్తున లారీలు నిలిచిపోయాయి.
ఫుడ్‌పార్క్ వద్ద ఆందోళన
వేతన చెల్లింపుల్లో మోసమంటూ నిరసన
గొడౌన్లకు వచ్చిన లారీల అడ్డగింత
Comments
Please login to add a commentAdd a comment