సురక్షిత ప్రసవాలే లక్ష్యం కావాలి
పార్వతీపురం: గర్భిణుల ఆరోగ్యం, సురక్షి ప్రసవాలే లక్ష్యంగా సీ్త్ర శిశుసంక్షేమశాఖ అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీ్త్ర శిశుసంక్షేమ కార్యక్రమాలపై మంగళవారం సమీక్షించారు. గర్భిణుల్లో రక్తహీనత నివారణకు అంగన్‌వాడీలు కీలక భూమిక పోషించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు టేక్‌హోం రేషన్ ఇవ్వడమే కాకుండా అంగన్‌వాడీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీసీపీఓ ఎ.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
గౌరీపురం వద్ద ఏనుగుల గుంపు
జియ్యమ్మవలస: మండలంలోని పెదకుదమ–గౌరీపురం పంట పొలాల మధ్య ఏనుగులు మంగళవారం దర్శనమిచ్చాయి. అరటి, పామాయిల్ తోటల్లో సంచరిస్తూ నాగావళి నదిలోకి జారుకుంటున్నాయి. పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. వరి నాట్లు వేసేందుకు బిక్కుబిక్కుమంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
10 నుంచి
టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు
● ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
వీరఘట్టం: పదోతరగతి విద్యార్థులకు ఈ నెల 10 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని డీఈఓ ఎన్.తిరుపతినాయుడు తెలిపారు.
10 న ఫస్ట్ లాంగ్వేజీ, 11న సెకెండ్ లాంగ్వేజ్, 12న ఇంగ్లిష్, 15న గణితం, 17న ఫిజికల్ సైన్స్, 18న బయలాజికల్ సైన్స్, 20న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు.
ప్రయోగ పరీక్షలకు వేళాయె..
పార్వతీపురంటౌన్: పరీక్షల సీజన్ మొదలైంది. ఇంటర్మీడియట్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల కావడంతో విద్యార్థులను సన్నద్ధం చేయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులకు బుధవారం నుంచి ప్రయోగపరీక్షలు జరగనున్నవి. 5–10, 11–15, 16–20 తేదీల్లో మూడు ఫేజ్‌లలో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. బోటనీ సబ్జెక్టు 1808 మంది, జువాలజీ1808, ఫిజిక్స్ 4,217, కెమిస్ట్రీ సబ్టెక్టుకు 4,217 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 6,026 మంది జనరల్ విద్యార్థులు, 5926 ఒకేషనల్ విద్యార్థులు ప్రయోగ పరీక్షలు రాయనున్నారు. జనరల్ ప్రాక్టికల్స్‌కు 37, ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 40 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేవామని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రయోగ పరీక్షలు సాగుతాయని డీవీఈఓ మంజులా వేణ తెలిపారు. తమ విద్యార్థులు అధిక మార్కులు సాధించేలా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షలు
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి వెటర్నరీ కళాశాల విద్యార్థులు రెండో రోజు మంగళవారం నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగించారు. వీసీఐ గుర్తింపుతో పాటుగా ఇంటర్న్‌షిప్ స్టైఫండ్‌ను రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కళాశాల ఆవరణలో ర్యాలీ చేశారు. కళాశాల భవనాలపైకి ఎక్కి తమ డిమాండ్లు పరిష్కరించే వరుకు దీక్షలను ఆపేది లేదని హెచ్చరించారు.
పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న వీరఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment