![ఏజెన్సీ బంద్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10plkd71-280038_mr-1739216283-0.jpg.webp?itok=IH4T-dp4)
ఏజెన్సీ బంద్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు
● స్పీకర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి ● పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి
సీతంపేట: గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12న జరగనున్న ఏజెన్సీ బంద్‌కు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు. స్థానిక ఎంపీపీ కార్యాలయ ఆవరణలో నాయకులతో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి 1/70 చట్టం కారణంగా విఘాతం ఏర్పడుతుందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని గిరిజనులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు సరికావని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖమంత్రి ఖండించకపోవడం విచారకరమన్నారు. రాజ్యాంగ బద్ధంగా కల్పించిన గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయకుండా, గిరిజనులను కించపర్చడం విడ్డూరంగా ఉందన్నారు. చట్టాలను అమలు పర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అహర్నిశలు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కృషిచేశారన్నారు. నాన్‌షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని మా ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించామన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజన హక్కులను తుంగలో తొక్కడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దీనికి నిరసనగా చేస్తున్న ఏజెన్సీ బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, వైస్ ఎంపీపీ కుండంగి సరస్వతి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హిమరక మోహన్‌రావు, సర్పంచ్‌లు కె.వెంకునాయుడు, ఎ.కళావతి, హెచ్.ఆదిలక్ష్మి, ఎస్.సుశీల, ఎన్.తిరుపతిరావు, బి.తిరుపతిరావు, ప్రవీణ్, ఎంపీటీసీలు ఎస్. మంగయ్య, ఎస్.చంద్రశేఖరరావు, జి.కోటేశ్వరరా వు, గణేష్, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్.రాము, ఎన్.కృష్ణ, ఎన్.అబ్బాస్, వెంకీ, ఎస్.మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment