![కలిసికట్టుగా బోదకాలు వ్యాధిని నిర్మూలిద్దాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ppm52a-370014_mr-1739216284-0.jpg.webp?itok=FOzcrfGF)
కలిసికట్టుగా బోదకాలు వ్యాధిని నిర్మూలిద్దాం
బలిజిపేట: ప్రతి ఒక్కరం పరిశుభ్రతను పాటించి కలిసికట్టుగా బోదకాలు వ్యాధిని నిర్మూలిద్దామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. పెదపెంకిలో బోద కాలు వ్యాధి నివారణ, నులిపురుగుల నివారణ మందులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఏ ఒక్కరికి బోదకాలు వ్యాధి సోకకుండా నివారించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. ఒకప్పుడు ఎక్కువగా నమోదయ్యే పోలియో కేసుల ను నిర్మూలించగలిగామన్నారు. మండలంలో 333 మంది వరకు బోదకాలు వ్యాధి బాధితులు ఉన్నార ని తెలిపారు. దీని నివారణకు వైద్యులు, ఎంఎల్‌పీఎస్‌తో కూడిన వైద్య బృందాలను ఏర్పాటు చేసి మైక్రోపైలేరియా (బోదకాలు) పరీక్షలు రాత్రిపూట నిర్వహించామన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త వ్యర్థాలను వేరుచేసి చెత్త నుంచి సంపద తయారుచేసే కేంద్రాలలో వర్మీ కంపోస్టు తయారు చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
పరీక్ష పేలో కలెక్టర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా నిర్వహించిన పరీక్షపేపై చర్చ ప్రత్యక్ష ప్రసారాన్ని పెదపెంకి ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి తిలకించారు. విద్యార్థి దశనుంచి ఉన్నత లక్ష్యాలు ఏర్ప రచుకుని వాటి సాధనకు ఏకాగ్రత, క్రమశిక్షణతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో వివి ధ విభాగాల అధికారులు శాంతిప్రియ, భాస్కరరావు, తిరుపతినాయుడు, రాబర్ట్‌పాల్, మణి, రత్నకుమారి, విజయలక్ష్మి, సింహాచలం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment