![పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు నిర్వహించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10krp143a-370017_mr-1739216285-0.jpg.webp?itok=yeUsc514)
పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు నిర్వహించాలి
● కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం: జిల్లాలో మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదోతరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 10,455 మంది విద్యార్థులు ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాయనున్నారని, ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప్రథమ చికిత్స కిట్లతోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నా రు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేయాల ని ఆదేశించారు. డీఈఓ ఎన్. తిరుపతినాయుడు మాట్లాడుతూ జిల్లాలో 220 పాఠశాలలకు చెందిన 10,367మంది రెగ్యులర్, 88 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. జిల్లాలోని 67 పరీక్ష కేంద్రాలకు 67మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామ ని తెలిపారు. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో మార్చి 17 నుంచి 28వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు, మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయన్నారు. పదోతరగ తి పరీక్షలకు 560మంది, ఇంటర్మీడియట్‌కు 436 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించా రు. సమావేశంలో డీఆర్వో కె.హేమలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment