![1/70 చట్టాన్ని సవరిస్తే... సంక్షోభంలో గిరిజనుల భవిష్యత్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10slr21-370028_mr-1739216283-0.jpg.webp?itok=i6n200i_)
1/70 చట్టాన్ని సవరిస్తే... సంక్షోభంలో గిరిజనుల భవిష్యత్
సాలూరు: ఏజెన్సీలో 1/70 చట్టాన్ని సవరించినప్పు డే అభివృద్ధి సాధ్యమన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా మంగళ, బుధవారాల్లో జర గబోయే మన్యం బంద్‌కు ఓ గిరిజనుడిగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రకటించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో సోమవారం మాట్లాడారు. 1/70 చట్టాన్ని సవరిస్తే గిరిజనుల భవిష్యత్ సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. 1/70 చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో భూమి పై పూర్తి హక్కు గ్రామసభ, పంచాయతీ, గిరిజన సలహామండలికి ఉంటుందని, ఇదే విషయాన్ని 1997లో సమతా జడ్జిమెంట్‌లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో సెంటు భూమి సేకారించాలన్నా గ్రామసభ ఆమోదం, పంచాయతీ తీర్మానం అవసరమని, అనంతరం గిరి జన సలహామండలికి వెళ్తుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి గిరిజనుల హక్కు లు, చట్టాల సవరవణ కోసం ప్రయత్నిస్తూ గిరిజనులకు రక్షణ కరువవుతోందన్నారు. గతంలో పీసా చట్టాన్ని సవరించి గిరిజన ప్రాంతాన్ని బడాబాబుల కు కట్టబెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు.
రాష్ట్రంలో సుమారు 554 గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించే ప్రక్రియ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల మధ్య దశాబ్దాలుగా నలుగుతోందన్నారు. సాలూరు మండలం జగ్గుదొరవలసలో ఏజెన్సీ సర్టిఫికెట్ల కోసం గిరిజనులు ఆందోళన చేసినప్పుడు అక్కడకు నాటి ప్రతిపక్ష నేతలు సంధ్యారాణి, భంజ్‌దేవ్‌లు వెళ్లి అదికారంలోకి రాగానే ఏజెన్సీ సర్టిఫికె ట్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీ ఎప్పు డు అమలు చేస్తారని ప్రశ్నించారు. కుడుమూరు భూములు గిరిజనులకు ఇస్తామని నాడు సంధ్యారా ణి తెలిపారని, జీఓ 3ను పునరుద్ధరిస్తామని సంధ్యారాణి, నారా లోకేష్‌లు హామీ ఇచ్చారని గుర్తుచేశా రు. దీనిపై గిరిజన సంఘాలు నిలదీయాలని కోరా రు. సమావేశంలో మోహన్, గోవింద, రామకృష్ణ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
● మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
Comments
Please login to add a commentAdd a comment