![రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10vzg174-370045_mr-1739216284-0.jpg.webp?itok=eke-NqcH)
రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
విజయనగరం క్రైమ్: సబ్‌జైల్ నుంచి ఎస్కార్ట్ వాహనంలో విజయనగరం కోర్టుకు సోమవారం హాజరైన రిమాండ్ ఖైదీ.. అదే కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన ఐ.త్రిమూర్తులు ఐదేళ్ల కిందట విజయనగరం అమ్మవారి జాతరలో పరిచయమైన ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. జిల్లా కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. గత నెలలో అనకాపల్లిలో పట్టుకుని ఆయనను అరెస్టు చేసి సబ్‌జైల్‌లో ఉంచారు. ఎస్కార్ట్ సాయంతో కోర్టు వాయిదాకు తీసుకువచ్చారు. వాయిదాకు వస్తాడని తెలిసి అమ్మ నాగమణి, మూడో అక్క నాగేశ్వరి సైతం కోర్టుకు వచ్చారు. ఐదేళ్ల నుంచి వాయిదాలకు తిరుగుతున్నానని, బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోదామని నిర్ణయించుకుని మూడో ఫ్లోర్ నుంచి దూకేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కాళ్లు, చేతులు, తలకు చిన్నపాటి గాయాలయ్యాయని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని టూటౌన్ పోలీసులు తెలిపారు.
కోర్టు భవనంపై నుంచి దూకిన ఖైదీ
Comments
Please login to add a commentAdd a comment