‘భరోసా’తో మరింత భద్రత
కరీంనగర్‌క్రైం: భరోసా కేంద్రాలతో బాలికలు, మహిళలకు మరింత భద్రత ఉంటుందని, పోలీ స్, వైద్యం, న్యాయసేవలు ఒకే గొడుకు కిందకు వస్తాయని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. క రీంనగర్‌లోని కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చే సిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించి.. ఆయా వి భాగాలు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. భరోసాకేంద్రాల ఏర్పాటు దేశవ్యాప్తంగా కేవలం మన రాష్ట్రంలోనే ఉందని, ఈ కేంద్రాల ఏర్పాటును సుప్రీంకోర్టు కూడా అభినందించిందని తెలిపారు. కరీంనగర్‌లో వెయ్యి గజాల స్థ లంలో 6,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చాలా అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. సోమవారం నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు, పి ల్లల కోసం పోలీసుశాఖ, ఉమెన్ సేఫ్టీవింగ్ ఆధ్వర్యంలో అన్ని కమిషనరేట్, జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు శిక్షల శాతం పెరుగుతుందన్నారు. బాధిత మహిళలకు మానసిక ప్రో త్సాహం, పోలీస్ సేవలు, అవసరమైన వైద్య సాయం, న్యాయ సేవ, బాధితులకు సహాయ ని ధి వంటి ఇతర సేవలు అందుబాటులో ఉంటా యని తెలిపారు. భరోసా కేంద్రం ద్వారా పోక్సో కేసుల బారిన పడిన వారికి తక్షణ సహాయం అందించడం, ఎఫ్‌ఐఆర్ మొదలు కోర్టుల్లో శిక్ష పడేవరకు బాధితులకు బాసటగా నిలుస్తుందని వివరించారు. కరీంనగర్ భరోసా కేంద్రంలో ఇప్పటి కే ఐదుగురిని నియమించామని, మరిన్ని నియామకాలు చేపడతామని తెలిపారు. మహిళా పోలీ స్‌స్టేషన్ సీఐ, షీటీం ఇన్‌చార్జి శ్రీలత, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా భరోసా కేంద్రాలు రాష్ట్రంలోనే..
ఒకే గొడుగు కిందకు పోలీస్, వైద్యం, న్యాయసేవలు
భరోసా కేంద్రాలతో నిందితులకు త్వరగా శిక్షలు
విలేకరుల సమావేశంలో డీజీపీ డాక్టర్ జితేందర్
Comments
Please login to add a commentAdd a comment