రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించండి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
సుల్తానాబాద్(పెద్దపల్లి): సుల్తానాబాద్ పట్టణంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి గట్టెపల్లి వెళ్లే రోడ్డు విస్తరణ పనులు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత కళాశాల షట్ట ర్లు తొలగించాలన్నారు. జంక్షన్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. పట్టణంలో నూ తనంగా పాఠశాల, జూనియర్ కళాశాల నిర్మాణా నికి అ నువైన స్థలాన్ని ఎంపిక చేయాలని ఆదేశించా రు. స మావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్, మున్సి పల్ కమిషనర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment