బాగా చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి
గోదావరిఖనిటౌన్(రామగుండం): స్థానిక ప్రశాంత్‌నగర్‌లోని జ్యోతిబా పూలే హాస్టల్‌ను గురువారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఈ మధ్య ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగాయని అందుకే హాస్టల్స్ విజిట్ చేయడం జరిగిందన్నారు. నాణ్యమైన ఆహారం అందించి ఫుడ్ పాయిజన్ కేసులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం హాస్టల్ సిబ్బంది పలు సమస్యలను ఎంపీకి వివరించగా, ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి తన వంతు సహకారం అందించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment