పోలీసుల పనితీరుపై అభిప్రాయం తెలపండి
గోదావరిఖని(రామగుండం): పోలీసుల పనితీరుపై స్కాన్‌చేసి ప్రజాభిప్రాయం తెలపాలని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం సీపీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈసందర్భంగా జూమ్ మీటింగ్ ద్వారా అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది పని తీరు, ప్రవర్తన, స్పందించిన విధానంపై ప్రజలు తమ అభిప్రాయం తెలిపేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతి ప్రవేశపెట్టినట్లు వివరించారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో, కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
అధైర్యపడకండి..
సుల్తానాబాద్(పెద్దపల్లి): షట్టర్లు కోల్పోయేవారు అధైర్యపడవద్దని అండగా ఉండి సేవ చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రహదారి విస్తరణలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట నిర్మించిన షట్టర్లను తొలగించే ప్రక్రియ జరుగుతుండడంతో గురువారం ఎమ్మెల్యేను పలువురు వ్యాపారులు కలిశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మళ్లీ షట్టర్లు నిర్మించి అందజేయడం జరుగుతుందని, కొంత సమయం పడుతుందని ఓపిక పట్టాలని వ్యాపారులకు వివరించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా షట్టర్ నిర్మించి ఇస్తామని తెలిపారు.
పథకాల అమలులో కీలకంగా వ్యవహరించాలి
జ్యోతినగర్(రామగుండం): అర్హులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కీలకంగా వ్యవహరించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. గురువారం ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని మిలీనియం హాలులో అంతర్గాం, పాలకుర్తి మండలాల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పథకాల పనితీరును తె లుసుకున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరో సా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు ఇవ్వడాని కి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో అర్హులకు సంక్షేమ పథకాల అమలు విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు.
హైవే పనులకు సహకరించాలి
రామగిరి(మంథని): మండలంలోని ఆదివారంపేట గ్రామంలో చేపడుతున్న నేషనల్ హైవే పనులకు రైతులు సహకరించాలని మంథని ఆర్డీవో సురేశ్ అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద రైతులతో సమావేశమై చర్చించారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అడ్డుకోవద్దని, పరిహారం విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, 19 మంది రైతులు పరిహారం అందలేదని తెలిపారు. అలాగే అంచనాలు వేసే విషయంలో పొరపాట్లు జరిగాయని, పూర్తి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పనులు నిర్వహించవద్దని రైతులు కోరారు. పంటలు వేసి మందులు చల్లడం కూడా జరిగిందని రెండు నెలల తర్వాత పనులు మొదలుపెట్టాలని మరికొందరు పేర్కొన్నారు. కొంతసేపు రైతులు, ఆర్డీవో మధ్య వాగ్వాదం జరుగగా, పనులు ఆపే ప్రసక్తే లేదని ఆర్డీవో తెలిపారు. తమకు పూర్తి పరిహారం తేలేదాక పనులు కొనసాగనివ్వమని రైతులు తేల్చిచెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంచందర్‌రావు, ఎస్సై చంద్రకుమార్, ఆర్‌ఐ రవిశంకర్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment