కత్తులు దూసుకుంటున్నారు..
గోదావరిఖని: కక్షలు కాలు దువ్వుతున్నాయి.. కత్తులు దూసుకు వస్తున్నాయి.. పగలు ప్రతీకారం తీసుకుంటున్నాయి.. చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నాయి.. పరిష్కారానికి యోగ్యమైన సమస్యలూ ప్రాణాల మీదకు తెస్తున్నాయి.. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు జిల్లావాసులను కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రధానంగా గత డిసెంబర్ 31న ఓ యువకుడిపై జరిగిన తల్వార్ దాడి, మంగళవారం చోటుచేసుకున్న హత్యాయత్నం సమస్య తీవ్రతకు అద్దంపడుతున్నాయి.
భిన్న మతాలు.. విభిన్న సంస్కృతులు..
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించిన కోల్‌బెల్ట్ ప్రాంతంలో భిన్న మతాలు, విభిన్న సంస్కృతుల ప్రజలు ఉన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, కేశోరాం తదితర పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు ఉపాధి కోసం వలస వచ్చి నివాసం ఉంటున్నారు. ఇలా సమైక్య జీవనంతో జిల్లా విరాజల్లుతోంది. కానీ, కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న దాడులు, ప్రతిదాడులు, హత్యలు, హత్యాయత్నాలు సమైక్య జీవనానికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఇవి అదుపులోకి రావడం లే
కత్తులతో వేటాడి.. వెంటాడి..
తన తమ్ముడిని చంపాడనే కోపంతో రెండేళ్ల క్రితం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఓ వ్యక్తిని వెంటాడి, వేటాడి కత్తులతో నరికి చంపాడో నిందితుడు. వందల మంది చూస్తుండగానే ఈ హత్య చేటుచేసుకోవడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు నిర్వహించిన శవయాత్రలో కొందరు తర్వార్లతో నృత్యాలు చేయడం ప్రజల్లో భయాందోళనలకు దారితీసింది. రెండు నెలల క్రితం యైటింక్లయిన్‌కాలనీలో తన భార్యను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ యువకుడిని ఆమె ముందే నరికి చంపాడు మొదటి భర్త. తట్టుకోలేని మృతుడి భార్య తీవ్ర మనోవేదనకు గురైంది. రెండు రోజుల తర్వాత తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పగతో రగిలిపోతున్న యువత చిన్నకారణాలకే హత్యాయత్నాలు హత్యలకూ వెనకాడని తీరు వారంలో ఇద్దరిపై కత్తుల దాడి వణుకుతున్న నగరవాసులు
మూడేళ్లలో నమోదైన కేసులు
ఏడాది హత్యలు హత్యాయత్నాలు
2022 24 32
2023 16 46
2024 17 51
31 డిసెంబరు 2024న –––––––––––––––
గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వద్ద నంది శ్రీనివాస్‌పై మేనకోడలు భర్త.. తల్వార్‌తో హఠాత్తుగా దాడిచేశాడు. విద్యార్థులు, అధ్యాపకులు చూస్తుండగానే విచక్షణా రహితంగా దాడిచేయడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మంగళవారం మృతి చెందాడు.
ఆర్‌ఎంపీపై దాడి
గోదావరిఖని రాంనగర్ అయ్యప్పస్వామి టెంపు ల్ సమీపంలోని సింగరే ణి క్వార్టర్‌లో నివాసం ఉంటున్న ఆర్‌ఎంపీ పరాంకుశం యశ్వంత్ మంగళవారం తీవ్రగాయాల పాలయ్యారు. ఏసీపీ రమేశ్ కథనం ప్రకారం.. సింగరేణి ఏరియా ఆస్పత్రిలో న ర్స్‌గా పనిచేస్తున్న ప్రతిమ.. మొదటి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి చేరుకుంది. అప్పటికే తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడిఉన్న భర్త యశ్వంత్‌ను చూసి వెంటనే సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చి కిత్స తర్వాత కరీంనగర్ తీసుకెళ్లారు. ఇంటి తలుపులు వేసే ఉన్నాయని, తెలిసిన వారే పదునైన ఆయుధంతో దాడిచేసి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం ఘటన స్థలాన్ని పరిశీలించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నాం
శాంతిభద్రల పరిరక్షణ కోసం అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కరడుగట్టిన, పాతనేరస్తులపై హిస్టరీషీట్, రౌడీషీట్ తెరుస్తున్నాం. అవసరమైతే కొందరిపై పీడీయాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. అయితే, మారుతున్న సమాజంలో మానవ సంబంధాలపై విస్తతంగా చర్చ జరగాలి. ఇందుకోసం స్వచ్ఛంద, యువజన తదితర సంస్థలు, సంఘాలు ప్రజల్లో అవగాహన కల్పించాలి. దాడికి గురైన యశ్వంత్ ఘటనపై అన్ని కోణాల్లోంచి దర్యాప్తు ప్రారంభించాం. – రమేశ్, ఏసీపీ, గోదావరిఖని
Comments
Please login to add a commentAdd a comment