పెద్దపల్లిరూరల్: దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ కోసం ఈనెల 8న సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. తాత్కాలిక సదరం సర్టిఫికెట్లు ఉన్నవారు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 9న, జనవరి 23న జిల్లా ఆస్పత్రిలో, ఈనెల 17న, 30న గోదావరిఖని జనరల్ ఆస్పత్రిలో సదరం శిబిరాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ రశీదు తోపాటు వైకల్యం కాపీ, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టుసైజ్ ఫొటో, మెడికల్ రిపోర్ట్, మొబైల్‌ఫోన్ వెంట తీసుకు రావాలని కాళిందిని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment