ఆస్తిపన్ను వసూలు చేయండి
ధర్మారం(ధర్మపురి): జిల్లాలో ఆస్తిపన్ను బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదేశించారు. మల్లాపూర్ గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. సెక్రిగేషన్ షెడ్, నర్సరీ, శానిటేషన్, మంచినీటి సరఫరా తీరును ఆయన తనిఖీ చేశారు. పెట్రోల్ బంకు పన్ను రూ.22,878 వసూలు చేశారు. అనంతరం ధర్మారంలోని మినీ గిరిజన గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. వి ద్యార్థులకు భోజన, బోధన, వసతి తదితర సౌ కర్యాల గురించి సిబ్బందిని అడిగి తెసులుకున్నారు. ఆ తర్వాత మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల వివిధ పను లపై సమీక్షించారు. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్ల క్ష్యం చేయరాదని సూచించారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి వేణుగోపాల్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో రమేశ్, ఏపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment