ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్
గోదావరిఖని: సమస్యలు పరిష్కరించాలని విన్నవించేందుకు వచ్చిన వారితో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజలు నేరుగా క్యాంపు కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలియజేస్తే సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రామ గుండం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకు లు, నగరవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఐ పాస్ పుస్తకం ఆవిష్కరణ
గోదావరిఖనిటౌన్: ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(ఎల్టా) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆంగ్లం రిసోర్స్ పర్సన్స్ రూపొందించిన పదో తరగతి ఐ–పాస్(ఇంటెన్సివ్ ప్రాక్టీస్ ఎయిమ్స్ సూర్ సక్సెస్) ప్రశ్నావళి పుస్తకాన్ని స్థానిక గాంధీపార్క్ ప్రభుత్వ పాథమిక పాఠశాలలో డీఈ వో మాధవి మంగళవారం ఆవిష్కరించారు. ప దో తరగతి విద్యార్థులు సాధన చేసేలా ప్రతీ యూనిట్ నుంచి రీడింగ్ పాసేజ్, గ్రామర్, సృజనాత్మక రచనలు, ప్రశ్నలు రూపొందించడం అభినందనీయమన్నారు. ఆంగ్లం ఉపాధ్యాయుడు గడ్డం జగదీశ్వర్ పుస్తకం రచించారని తెలిపారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీ సర్ పీఎం షేక్, ప్రతినిధులు వి.అశోక్, ఉపా ధ్యాయులు హరీశ్, కనకయ్య, రవీందర్, సునీ ల్, వెంకటేశ్, గోపి, ఉమ, మధుకర్, అరుణ, జ్యోతి, రమేశ్, గౌతమి, సత్యవతి, ఫర్హీన్, శోభారాణి, రవి తదితరులు పాల్గొన్నారు.
22 వరకు ‘ఓపెన్’ పరీక్ష ఫీజు చెల్లించాలి
జ్యోతినగర్(రామగుండం): ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ 2024–25 విద్యా సంవత్సరం పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైందని ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో పరీక్షలు నిర్వహించనున్నా రని పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యేవారు ఈనెల 9 – 22వ తేదీ వరకు ఎలాంటి అపరా ధ రుసుం లేకుండా ఫీజు చెల్లించాలన్నారు. ఎ స్సెస్సీ ప్రతీ సబ్జెక్టుకు రూ.100, ఇంటర్‌కు రూ. 150 చొప్పున ఫీజు ఉందన్నారు. రూ.25 రుసుంతో ఈనెల 23 – 29 వరకు, రూ.50 రుసుంతో ఈనెల 30 – ఫిబ్రవరి 3వ తేదీ వరకు, తత్కాల్ రుసుంతో ఫిబ్రవరి 4 – 6 వ తేదీ వరకు ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించాలని ఆయన సూచించారు.
మూడు రోజులపాటు తాగునీటి సరఫరా బంద్
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంతోపాటు ఓదెల మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మిషన్ భగీరథ ఈఈ పూర్ణచందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లిలోని శాంతినగర్ వద్ద పైప్‌లైన్ లీకై ందని, మరమ్మతులు పూర్తయ్యే వరకూ నీటి సరఫరా నిలిపివేస్తున్నామని పేర్కొ న్నారు. దీంతో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లిరూరల్: తక్కువ వడ్డీతో మంజూరు చేస్తున్న సీ్త్రనిధి రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ సూచించారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవడంతోపాటు అనవసరపు ఇబ్బందులకు లోను కావొద్దన్నారు. అర్హులైన సంఘాల సభ్యులకు సీ్త్రనిధి రుణాలు అందేలా మెప్మా సిబ్బంది సహకరించాలని ఆదేశించారు. జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్, మంథని పట్టణాల్లో 213 మహిళా సమాఖ్యలకు రూ.6.11 కోట్ల సీ్త్రనిధి రుణాలు అందించినట్లు ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment