మంథని సమగ్ర అభివృద్ధి లక్ష్యం
మంథని: పట్టణ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రూ.24.05 కోట్ల వ్యయంతో పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మంగళవారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంట నే రూ.30 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేప ట్టామన్నారు. ఆర్నెల్లలోనే మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మించాలని సూచించారు. మంథని – మంచిర్యాలను అనుసంధానిస్తూ రూ.140 కోట్లతో గోదావరి నదిపై వంతెన మంజూరు చేసుకున్నట్లు వివరించారు. మంథనిలో రింగ్‌రోడ్డు నిర్మాణంతో పట్టణం విస్తరించి దేశ, విదేశాల్లో స్థిరపడిన వారు స్వస్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు వస్తారని అ న్నారు. పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అనంతరం మంత్రి ఆలింకో సంస్థ నిర్వహించిన క్యాంపులో ఎంపికై న దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.
కాంగ్రెస్‌కు పేరు .. ప్రతిపక్షాలకు భయం
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంటే ప్రజల్లో కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తోందని ప్రతిపక్షాలు, ప్రధానంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ స ర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆర్డీవో సురేశ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమ, కమిషనర్ మ నోహర్, తహసీల్దార్ రాజయ్య, ఈఈ సంపత్, సింగిల్‌విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment