కాంగ్రెస్ సర్కారుతోనే రైతులకు మేలు
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్ర భుత్వం పాటుపడుతోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్ర భుత్వం సన్నరకం ధాన్యం క్వింటాలకు రూ.500 బోనస్ ప్రకటించి కొనుగోలు చేసిన వెంటనే చెల్లింపులు చేసిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రై తులకు ఏమీ చేయడం లేదని బీఆర్‌ఎస్ నాయకు లు రోడ్డెక్కి నిరసనకు దిగడం శోచనీయమన్నారు. ధాన్యంలో ఎడాపెడా కోత పెట్టి బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు దోచుకున్నారని ఆరోపించారు. అప్పటి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రైస్ మిల్లర్లతో కుమ్మకై ్క రూ.కోట్లు దోచుకుని ఇప్పుడు రోడ్డెక్కడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ పాలనలో తూకంలో కోతలు లేవన్నారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని గుర్తుచేశారు. అవినీతి, అక్రమాలపై ఏ సీబీ నమోదు చేసిన కేసులో తాను నిర్దోషినని మా జీమంత్రి కేటీఆర్ హైకోర్టును ఎందుకు ఆశ్రయించా ల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, నాయకులు రామ్మూర్తి, సంపత్, సుభాష్, జగదీశ్, మస్రత్, శ్రీను, సంతోష్, రమేశ్, మహేందర్, గౌస్‌మియా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment