ఎన్‌సీడీ సర్వే పూర్తిచేయాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టిన ఎన్‌సీడీ స ర్వేను ఈనెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్ట ర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా వైద్య, ఆ రోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు. మాతాశి శు ఆరోగ్య సంరక్షణ కేంద్రం, డయాగ్నోస్టిక్ హబ్, ఎంఎల్‌హెచ్‌పీ, ఎన్‌పీడీ సర్వే తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలిచ్చా రు. జిల్లా ఆస్పత్రితోపాటు మంథని, సు ల్తా నాబాద్‌లో ఓపీ సేవలు పెంచాలని సూచించా రు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి, సూపరింటెండెంట్ శ్రీధర్ ఉన్నారు.
మార్చి వరకు పనులు పూర్తిచేయాలి
జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మార్చి వరకు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారుల తో ప్రగతి పనులపై సమీక్షించారు. జిల్లాలో చేపట్టిన ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, హా స్టల్ భవన మరమ్మతులకు నిధులు మంజూ రు చేశామని తెలిపారు. ఈనెల 20వ తేదీవర కు పనులు ప్రారంభించి మార్చివరకు పూర్తిచేయాలని సూచించారు. ఈఈ గిరీశ్‌బాబు, సీపీవో రవీందర్, ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆస్పత్రి మరమ్మతులు పరిశీలన
మంథని/రామగిరి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మరమ్మతులు, రామగిరి ఎంపీడీవో ఆఫీసును కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఐదురో జుల్లో పనులు పూర్తిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment