ముంబై ప్రమాదంలో మేసీ్త్ర మృతి
సాయం చేయాల్సి దాతలు ఫోన్‌పే నంబర్ : 96039 85413
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన ఖానాపురం రాజు (38) ముంబైలో సోమవా రం జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన స్వగ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తులు తె లిపిన వివరాలు.. రాజు 15 ఏళ్లుగా జీవనోపాధి కోసం ముంబై వెళ్లి మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. బిల్డింగ్‌పైన పనిచేస్తుండగా ప్ర మాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు వెంటనే అక్కడి సమీ పంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని అక్కడే ఉంటున్న రాజు స్నేహితులు ముంబై నుంచి అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. కడు పేదరికం అనుభవిస్తు న్న రాజు కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతుడికి భార్య ఉష, కుమారుడు గణేశ్, కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment