పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఈనెల 11 నుంచి 15 వరకు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్ తెలిపారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వ్యాపారుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
పత్తి క్వింటాల్ ధర రూ.7,361
పెద్దపల్లి మార్కెట్‌యార్డులో గురువారం పత్తి క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.7,361 పలికింది. కనిష్టం రూ.6,811, సగటు ధర రూ.7,088 నమోదయిందని మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్ తెలిపారు. 655 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment