AP: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Today Political News Updates And Headlines On Jan 20th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political News Jan 20th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Jan 20 2024 6:51 AM | Updated on Feb 2 2024 9:05 PM

AP Elections Political News Updates Headlines 20th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

7:50PM, Jan 20, 2024

చంద్రబాబుపై తిరుగుబాటు చేసిన మాజీ ఎమ్మెల్యే సివెరి సోము కుటుంబ సభ్యులు

  • చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు: సివెరి సోము కుమారుడు సురేష్
  • చివరకు సీటు ఇస్తామని చెప్పి తమకు అన్యాయం చేశాడు..
  • వచ్చే ఎన్నికల్లో టిడిపి రెబల్ గా పోటీ చేస్తా..
  • తమ సత్తా చంద్రబాబుకు చూపిస్తా.
  • పార్టీ కోసమే మా నాన్న చనిపోయారు..
  • మా నాన్న చనిపోయిన సందర్భంలో ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పారు.. ఇవ్వలేదు
  • 2024 లో ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పారు.. ఇప్పుడు కూడా ఇవ్వలేదు..
  • టిడిపిలో కష్టపడిన వారికి న్యాయం జరగదు..
  • వచ్చే ఎన్నికల్లో టిడిపి ఎలా గెలుస్తుందో చూస్తాం
  • కష్టపడిన వారిని కాకుండా ఎవరో గొట్టం గాడికి సీటు ఇస్తే ఎలా ఊరుకుంటాం
  • చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు
  • చంద్రబాబువి మోసపూరిత మాటలు..
  • అరకులో పార్టీని నిలబెట్టింది సివెరి సోము
  • మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు
  • మా కుటుంబాన్ని ఆదుకొని చంద్రబాబు మాకు సీట్ ఇస్తాడు అంటే నమ్మాము
  • ఇక చంద్రబాబు మాయమాటలను నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు.
  • గిరిజన వ్యతిరేకి చంద్రబాబు
  • అమాయకులైన గిరిజనులను మోసం చేయడం చంద్రబాబు మొదటి నుంచి అలవాటు

6:03 PM, Jan 20, 2024
విజయవాడ పశ్చిమ నీదా? నాదా?

  • బెజవాడలో బీటలు వారుతున్న టీడీపీ జనసేన కూటమి
  • పశ్చిమ సీటు కోసం రెండు పార్టీల మధ్య పంతం
  • ఇప్పటికే జనసేన తరఫున బరిలో ఉన్న పోతిన మహేష్
  • జనసేనకు కాకుండా టీడీపీకి కేటాయించాలంటూ ఆ పార్టీ నేతల ఒత్తిడి
  • నారా లోకేష్ ను కలిసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న
  • ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేశాను
  • ఇప్పుడు పొత్తు అంటే ఎట్లా?
  • మొన్నటి వరకు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న కేశినేని నాని
  • నాని స్థానంలో ఇన్‌ఛార్జ్‌ నాకివ్వండి : బుద్ధా వెంకన్న
  • విజయవాడ పశ్చిమ టికెట్ ఇవ్వాలని కోరిన బుద్ధా వెంకన్న
  • తనకు టికెట్ ఇస్తే పార్టీ కోసం గట్టిగా పని చేస్తానన్న బుద్ధా వెంకన్న
  • తెర వెనక పోతిన మహేష్‌కు వ్యతిరేకంగా సిద్ధమవుతోన్న గ్రౌండ్‌

5:23 PM, Jan 20, 2024
అదెలా కుదురుతుంది? పెనమలూరులో ఎలా ఇస్తారు?

  • పెనమలూరు టీడీపీ ఇన్చార్జ్ బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
  • టీడీపీలో పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి చేరికపై వ్యాఖ్యలు
  • పార్ధ సారధి పెనమలూరు నుంచి టీడీపీ టికెట్ ఆశించడం ఆయన ఛాయిస్
  • ఐదేళ్ల నుంచి పార్టీ కోసం పెనమలూరులో కష్టపడ్డాను
  • పార్థసారధి చేరికపై ఇప్పుడే నేనేం మాట్లాడను : బోడే ప్రసాద్

5:20 PM, Jan 20, 2024
బ్యాన్‌ ఎల్లో మీడియా : రోజా

  • ఎల్లో మీడియా పై  మంత్రి రోజా ఫైర్
  • అంబేద్కర్ అంటే ఎల్లో మీడియాకు గౌరవం లేదు
  • అంబేద్కర్ విగ్రహావిష్కరణను చూపించేందుకు మనసు రాలేదా?
  • అంబేద్కర్ కు నిజమైన వారసుడు సీఎం జగన్
  • ఎల్లో మీడియా, ఎల్లో పత్రికలను బహిష్కరించాలి
  • అంబేద్కర్ ను ఎల్లో మీడియా అవమానించింది
  • కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియాను వాడుకున్న వ్యక్తి చంద్రబాబు
  • టీడీపీ, జనసేన తోక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం : మంత్రి రోజా

5:12 PM, Jan 20, 2024
ఏపీ వ్యవస్థ బెస్ట్‌

  • హైదరాబాద్ : ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ చాలా బాగుంది
  • ఏపీలో అధ్యయనం చేస్తాం : కిసాన్ సెల్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి

5:05 PM, Jan 20, 2024
ఇడుపులపాయకు షర్మిల

  • షర్మిల ప్రయత్నాలు ఎంత వరకు?
  • శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు షర్మిల
  • కడప నుంచి రోడ్డు మార్గం ద్వారా వైఎస్ఆర్ ఘాట్‌కు
  • షర్మిలతో పాటు కేవీపీ, రఘువీరా రెడ్డి
  • రేపు పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న షర్మిల
  • కడప ఎయిర్‌పోర్టుకు మాజీమంత్రి అహ్మదుల్లా 
  • జనసమీకరణ కోసం కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలు

4:55 PM, Jan 20, 2024
బ్యాన్‌ ఎల్లో మీడియా : ఆదిమూలపు

  • అంబేద్కర్ మహాశిల్ప ఆవిష్కరణ చారిత్రక ఘట్టం : మంత్రి ఆదిమూలపు సురేష్
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎల్లో మీడియాకి, చంద్రబాబుకి బుద్ధి చెప్పడం ఖాయం
  • ఆ కార్యక్రమాన్ని చూపించకపోవటం వివక్షాపూరిత అహంకారానికి నిదర్శనం
  • విగ్రహావిష్కరణను కూడా రాజకీయం చేయడం ఎల్లో మీడియాకే చెల్లింది
  • చంద్రబాబు తరహాలోనే ఎల్లో మీడియా అహంకారంతో వ్యవహరిస్తోంది : మంత్రి ఆదిమూలపు సురేష్

4:45 PM, Jan 20, 2024
చిన్నికు చురకలు

  • టిడిపిపై, కేశినేని చిన్నిపై కేశినేని నాని విమర్శలు
  • ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దు
  • కాల్ మనీ గాళ్ల మాటలకు సమాధానం చెప్పను
  • టిడిపి 60శాతం ఖాళీ అవుతుంది
  • అవసరమైతే 100శాతం ఖాళీ చేయిస్తా
  • లోకేష్ స్థాయి నా కంటే చాలా తక్కువే

4:30 PM, Jan 20, 2024
వంగాకు పచ్చపార్టీలోనే పొగ పెడుతున్నారా?

  • బెజవాడ సెంట్రల్ లో వంగవీటి రాధా పై పోస్టుల కలకలం
  • సెంట్రల్ నియోజకవర్గం వాట్సప్ గ్రూపుల్లో రాధా టార్గెట్ గా సర్క్యులేట్ అవుతున్న మెసేజ్‌లు
  • ఇవేనా రాధాను టీడీపీ నమ్మకపోవటానికి కారణాలు పేరుతో సర్క్యులేట్
  • రాధాకు టీడీపీ సెంట్రల్ సీటు ఇచ్చే అవకాశాలు ఉండటంతో ఇలా చేస్తున్నారని స్థానికంగా ప్రచారం
  • సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారం పై రాధా వర్గం సీరియస్
  • బోండా ఉమా వర్గమే ఇలా చేసి ఉంటారని రాధా అనుచరుల అనుమానం

4:13PM, Jan 20, 2024
సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?: మంత్రి కాకాణి

  • చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని కోర్టులు చెప్పలేదు
  • చంద్రబాబు తాను తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు
  • స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబుకు ఊరట లభించలేదు
  • బాబుకు ఊరట వచ్చిందని ఎల్లో మీడియా ప్రచారం​
  • సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?
  • చంద్రబాబును మించిన దొంగ రాష్ట్రంలో ఎవరూ లేరు
  • చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ ఉంటే ఒంటరిగా ఎందుకు పోటీ చేయడం లేదు
  • చంద్రబాబు రా కదలి రా అంటే ఎవ్వరూ రావడం లేదు
  • చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు
  • వ్యవసాయ రంగం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
  • చంద్రబాబు ఏరోజైనా వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్నారా?

3:31PM, Jan 20, 2024

పసలేని చంద్రబాబు స్పీచ్‌లు

  • అరకులో చంద్రబాబు సోది ప్రసంగం
  • చంద్రబాబు ప్రసంగం వినలేక సభ ప్రారంభంలోనే వెళ్లిపోయిన టీడీపీ కార్యకర్తలు
  • బాబు మాట్లాడుతుండగానే ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు..
  • రోజు చెప్పిన సోది చెప్పడంతో చిరాకు పడ్డ టీడీపీ నాయకులు

3:10PM, Jan 20, 2024

చంద్రబాబు మండపేట రా.. కదలిరా సభకు కలసిరాని జన సమీకరణ

  • జన సమీకరణ కోసం నియోజకవర్గాలకు  బస్సులు పంపిన టీడీపీ నేతలు
  • ఎంతసేపు ఎదురుచూసిన జనం రాకపోవడంతో ఖాళీగా వెను తిరిగిన బస్సులు
  • పలుచోట్ల  జనం కోసం నిరీక్షిస్తూ  నిలిచిపోయిన బస్సులు
  • టీడీపీ నేతలకు తలపోటుగా మారిన చంద్రబాబు సభ జన సమీకరణ వ్యవహారం

2:20PM, Jan 20, 2024

కేశినేని చిన్ని వ్యాఖ్యలకు ఎంపీ కేశినేని నాని కౌంటర్‌

  • బ్రోకర్ హౌస్ నడిపే వాళ్ళు, అక్రమ వ్యాపారాలు , కాల్ మనీ, లోఫర్,డాఫర్ గురించి నాతో మాట్లాడించొద్దు
  • ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ తరువాత మాట్లాడుదాం
  • ఉత్తర కుమార ప్రగల్భాలు పలకొద్దు
  • గతంలో నాతో ఉన్న అనుచరులను నాతో రమ్మని పిలవలేదు
  • ప్రజలు జగన్ వెంట ఉన్నారు 
  • నాయకుల పాత్ర తక్కువే ప్రజల పాత్ర ఎక్కువ
  • రాజీనామా అనంతరం నా అనుచరులతో సమావేశం అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరాలని అనుకున్నా
  • సీఎం జగన్‌ .పిలుపుతో వెంటనే వైఎస్సార్‌సీపీలో చేరాను
  • ఇప్పటికీ చెబుతున్న టీడీపీ 60% ఖాళీ అవుతుంది... అవసరం అయితే 100% ఖాళీ చేస్తా 
  • నా స్థాయి చంద్రబాబు స్థాయి 
  • లోకేష్ కూడా నా స్థాయి కంటే తక్కువే 
  • కాల్ మనీగాళ్ళ మాటలకు సమాధానం చెప్పను

01:55 PM, Jan 20, 2024
దొంగలంతా ఒకటవుతున్నారు: మంత్రి ఆర్కే రోజా

  • గతంలో కళాకారులను ఎవరూ పట్టించుకోలేదు
  • జగనన్న మాత్రమే కళాకారులను పట్టించుకున్నారు
  • కళాకారులు ఈ విషయాన్ని గుర్తించాలి
  • ఎన్నికల సమయంలో దొంగలంతా ఒకటవుతున్నారు
  • పందుల్లా గుంపులుగా వస్తున్నారు 
  • ‘జనం మనిషి’కి అన్యాయం చేయాలని చూస్తున్నారు
  • దొంగలకు బుద్ధి చెప్పాలంటే కళాకారుల ఆట.. మాట.. పాట కావాలి
  • ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024) ...జగనన్న వన్స్ మోర్
  • జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి
  • చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి పోయాడు
  • జనాన్ని దోచుకుని హైదరాబాద్‌లో ఆస్తులు దాచుకున్నాడు
  • మళ్లీ ఆ దొంగలొస్తే ప్రజలకు విద్య, వైద్యం, అన్నం దొరకదు
  • హైదరాబాద్ నుంచి వచ్చి విషం చిమ్మి పోతున్నారు
  • నానా లోకల్ పొలిటీషియన్ల గురించి మనం పట్టించుకోవద్దు
  •  జగనన్నకు మనం అండగా ఉండాలి
  • అంబేద్కర్‌కు దేశంలో ఎవరూ ఇవ్వలేనంత గౌరవం జగనన్న ఇచ్చారు
  • ప్రపంచమంతా జగనన్నను అభినందిస్తోంది
  • పక్క రాష్ట్రాల వారు జగనన్న వంటి ముఖ్యమంత్రి తమకు లేరని బాధపడుపతున్నారు
  • జిల్లాల వారీగా కళాకారులకు కార్డుల పంపిణీ చేస్తాం
  • కళాకారులకు మేం పూర్తిగా అండగా ఉంటాం

01:46 PM, Jan 20, 2024
ఆలస్యంగా అరకు బయలుదేరిన చంద్రబాబు

  • విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబు
  • విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో అనుకున్న సమయానికి బయలుదేరని చంద్రబాబు
  • హెలికాప్టర్‌లో ఆలస్యంగా అరకు బయలుదేరిన చంద్రబాబు
  • రూట్ క్లియరెన్స్ లేకపోవడంతో చంద్రబాబు హెలికాప్టర్ వెనక్కి రప్పించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు
  • కాసేపు అనంతరం మళ్లీ అరకు బయలుదేరిన చంద్రబాబు
  • కాసేపట్లో ‘రా కదలిరా’ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు

01:40 PM, Jan 20, 2024
ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై దళిత మహిళల ఆగ్రహం

  • విజయవాడలో ఈనాడు ,ఆంధ్రజ్యోతి పత్రికలను దహనం చేసిన దళిత మహిళలు
  • అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు
  • దళిత సంఘాలు ఆగ్రహం.. దళిత మహిళల ఆధ్వర్యంలో నిరసన
  • విషపు వార్తలు ప్రచురించి పత్రికల విలువలు దిగజారుస్తున్నారు: కోటా సామ్రాజ్యం
  • దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ విగ్రహాన్ని ఏరక్పాటు చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది
  • దళిత, బహుజనుల బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్
  • దళితులలో ఎవరైనా పుడతారా అంటూ దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబు, టీడీపీ నేతలకు దళితులంటే చులకన
  • రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు దళితులంతా ఏకమై మా ఓటుతో బుద్ధి చెబుతాం

01:09 PM, Jan 20, 2024
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై దళిత సంఘాల మండిపాటు

  • అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటును తట్టుకోలేకపోతున్నాయంటూ దళిత సంఘాల ఆగ్రహం
  • అంబేడ్కర్‌ ఆశయాలను సాకారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ
  • ప్రభుత్వం దేశానికే గర్వ కారణంగా స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ను ఏర్పాటు చేసింది
  • నిన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని గుంటూరు–మాచర్ల ప్రధాన రహదారిపై  పచ్చ పత్రికలను దహనం చేసిన దళిత సంఘాల నేతలు
  • ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని వాగిన చంద్రబాబు ఎక్కడ?
  • నియామక పదవులను, చివరికి కాంట్రాక్టు పనుల్లోనూ ఎస్సీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచిన దళిత పక్షపాతి సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్కడ?
  •  చంద్రబాబు, జగన్‌లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
  • ఈ విషయాన్ని ప్రజలంతా ఆలోచన చేయాలి
  • ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు విష ప్రచారాలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు
  • దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదు

12:45 PM, Jan 20, 2024
టీడీపీ నేత అవినాష్ రెడ్డిపై కేసు నమోదు

  • అన్నమయ్య జిల్లా కలికిరిలో టీడీపీ నేత అవినాష్ రెడ్డితో పాటు మరో 7 మందిపై కేసు నమోదు
  • గురువారం రాత్రి దళితులపై అవినాష్ రెడ్డితో పాటు కొంతమంది దాడి
  • సుమో వాహనం ధ్వంసం చేసి ఇద్దరినీ గాయపరిచిన టీడీపీ రౌడీలు
  • ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు
  • ఐపీసీ 147, 148, 354, 384, 324, 323, 427, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు

11:34 AM, Jan 20, 2024
నెల్లూరు: రేపు సూళ్లూరుపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర

  • బస్సు యాత్ర ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
  • నాయుడుపేటలోని విజయ గణపతి ఆలయం నుంచి  బజారు వీధులు మీదుగా బస్టాండ్ వరకు సాగనున్న ర్యాలీ
  • హాజరుకానున్న  రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు

11:29 AM, Jan 20, 2024
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల దహనం 

  • అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై విషం కక్కిన ఈనాడు, ఆంధ్రజ్యోతి 
  • పశ్చిమ గోదావరి జిల్లా  పెంటపాడులో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు ఆధ్వర్యంలో నిరసన
  • ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు.. పెత్తందారుల పక్షాన పని చేశాడు
  • చంద్రబాబు హయాంలో దళితులపై అనేక దాడులు జరిగాయి
  • సీఎం జగన్‌ పేదల పక్షాన అండగా నిలిచారు.
  • సీఎం జగన్‌ పేదల పక్షాన అండగా నిలిచారు
  • సీఎం జగన్‌ ప్రభుత్వం దళితులకు అండగా నిలబడటాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఓర్వలేకపోతున్నాయి 

10:58 AM, Jan 20, 2024
ఈనాడు, చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్‌

  • చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణకు భయం పట్టుకుంది
  • వీరంతా కళ్లు లేని కబోదులు.. అందుకే అంతమంది జనం వచ్చినా కనబడలేదు
  • చంద్రబాబు ముమ్మాటికీ దళిత ద్రోహే
  • రామోజీ, రాధాకృష్ణలు.. ఎన్ని క్రేన్‌లు పెట్టి చంద్రబాబును లేపినా ప్రయోజనం లేదు
  • అంబేద్కర్‌ను అవమానించేలా చంద్రబాబు పాలన సాగింది
  • గుండెల నిండా అంబేద్కర్‌ను పెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్‌
  • అంబేద్కర్‌ను అణువణువునా నింపుకుని సీఎం జగన్‌ పాలన చేస్తున్నారు
  • పేదలంతా సీఎం జగన్‌ వెంటే

10:49 AM, Jan 20, 2024
ఇవేం రోత రాతలు రామోజీ.. మంచి జరిగితే నచ్చదా?: మంత్రి వేణు

  • ఈ సమాజం ఎదగకూడదనేదే ఈనాడు పత్రిక ఆలోచన
  • చంద్రబాబుకు మద్దతుగా రాసేవన్నీ రోతరాతలే
  • అమ్మ ఒడితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన
  • ఈ సమాజానికి నీ రాతల వల్ల ఇచ్చే సందేశమేంటి రామోజీ
  • చంద్రబాబు చెప్పే అబద్ధాలను రాయడమే నీ పనా..?
  • 2024లో నీ రోత రాతలకు కాలం చెల్లుతుంది
  • లక్షలాది మంది వస్తే తట్టుకోలేక తప్పుడు వార్తలు రాస్తావా?
  • బాధ్యత మరిచి వార్తలు రాస్తున్న ఈనాడుని బహిష్కరించే రోజులు దగ్గర్లో ఉన్నాయ్
  • ఈనాడు వార్తలు అంబేద్కర్‌ను అవమానించినట్లుగానే మేం భావిస్తున్నాం
  • ఈనాడు పత్రిక తక్షణమే డా.బి.ఆర్.అంబేద్కర్‌కు క్షమాపణ చెప్పాలి

10:04 AM, Jan 20, 2024
బాబు దగా.. సీఎం జగన్‌ న్యాయం

  • విశాఖ మన్యాన్ని దగా చేసిన  చంద్రబాబు నాయుడు
  • 2014 లో మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఇస్తూ జీవో నెంబర్ 97 విడుదల చేసిన టీడీపీ ప్రభుత్వం
  • అరకులో భూగర్భ డ్రైనేజీ పనులు చేస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేసిన చంద్రబాబు
  • పెదలబుడు గ్రామానికి బస్సు సదుపాయం కల్పిస్తానని కపట వాగ్దానం చేసిన చంద్రబాబు
  • లంబసింగిని దత్తత తీసుకుంటానని ప్రకటించి పట్టించుకోని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
  • చింతపల్లి సభలో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే బాక్సైట్ తవ్వకాల జీవో 97 ను రద్దు చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • లంబసింగి లో టీడీపీ హయాంలో అర్ధాంతరంగా నిలిపివేసిన రిసార్ట్స్ పనులను పూర్తిచేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం

09:32 AM, Jan 20, 2024
దళిత ద్రోహి ఎవరు.. సామాజిక న్యాయం చేసిందెవరు?

  • హవ్వా.. దళిత ఎమ్మెల్యేలనే ట్రాన్స్‌ఫర్‌ చేస్తారా? ఏంటిది?.. అంటూ టీవీ5 సాంబ చౌదరి కితకితలు
  • ఫ్లాష్‌బ్యాక్‌ తెలియక మనోడు వేస్తున్న వేషాలకు.. ఫ్లాష్‌బ్యాక్‌ సరైన సమాధానం
  • ఏపీ(ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక..) రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసిందెవరు? అన్యాయం చేసిందెవరు?.
  • గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో సాంబడికి గుర్తు లేనట్లుంది!.
  • విశాఖ జిల్లాలో 2019 ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు
  •  కొవ్వూరు(ఎస్సీ) ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేఎస్‌ జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి ట్రాన్స్‌ఫర్‌ చేసి పోటీ చేయించారు.
  • ఇదే రీతిలో పలువురు ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీ చేయించారు చంద్రబాబు. 
  • వైఎస్సార్‌సీపీ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తోంది.
  • ఈ క్రమంలో నాలుగు జాబితాలకు కలిపి 58 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది
  • అందులో.. అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలను..  ఐదు బీసీలకు, రెండింటిని మైనారిటీలకు కేటాయించారు సీఎం జగన్‌
  • సీట్ల కేటాయింపులో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు.
  • మంగళగిరి ఆళ్ల  రామకృష్ణ రెడ్డి, కదిరి సిద్ధారెడ్డి, ఎమ్మిగనూరు  చెన్న  కేశవరెడ్డిలకు అలాగే.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పారాయన

సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్‌సీపీ జాబితా

  • ఎస్సీలు- 21 
  • ఎస్టీలు -3
  • బీసీలు- 17 
  • మైనార్టీలు- 4 
  • ఓసి - 13 

10 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. 

  • బీసీలు -6
  • ఎస్సీలు -2
  • ఎస్టీ -1 
  • ఓసీ -1 
  • ఏపీ కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చిన మంత్రి పదవులు - 17  (కేబినెట్‌లో 70 శాతం) 

బీసీ  మంత్రులు :

  • బాబు  పాలనలో-8
  • జగన్ పాలనలో-11

ఎస్సీ మంత్రులు:

  • బాబు పాలనలో-2
  • జగన్ పాలనలో-5
  • జగన్‌ పాలనలో ఉప ముఖ్యమంత్రులు -4 (80 శాతం)
  • తొలిసారిగా ఒక ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు

స్పీకర్ 

  • బాబు పాలనలో-కోడెల (కమ్మ)
  • జగన్ పాలనలో -తమ్మినేని సీతారాం (బీసీ)

బీసీలకు రాజ్యసభ స్థానాలు 

  • బాబు పాలనలో-0
  • జగన్ పాలనలో -4 
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 

ఎమ్మెల్సీలు

  • బాబు పాలనలో-48 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజిక వర్గాల నుంచి 18 మంది (37 శాతం )
  • జగన్ పాలనలో-43 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజికవర్గాల నుంచి 29 మంది (68 శాతం)
  • జగన్‌ హయాంలో మిగతావి.. 

13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో - 9 (69 శాతం) 
14  కార్పొరేషన్ మేయర్‌ పదవుల్లో  -12 (86 శాతం) 
గెలిచిన  84 మున్సిపల్ చైర్మన్  పోస్టుల్లో -58 (69 శాతం )
137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్‌ పదవులలో - 79 (58 శాతం) 
నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవులు-280 (58 శాతం)
196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లలో -117 (60 శాతం) 
7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో- 3,503 (50 శాతం )
బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు
ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు
ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు

09:09 AM, Jan 20, 2024
టీడీపీలో అడుగడుగునా అవమానాలే: నల్లగట్ల స్వామిదాసు

  • తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్లుగా సేవ చేసినా తనకు తీరని అన్యాయం జరిగింది
  • తిరువూరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆవేదన
  • చంద్రబాబు ఇటీవల తిరువూరు పర్యటనకు వచ్చినపుడు మాజీ ఎమ్మెల్యేగా తనకు కనీసం సమాచారం ఇవ్వలేదు
  • తనకు సీఎం జగన్‌ రాజకీయ పునర్జన్మ ఇచ్చారు
  • జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటా
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుర్తింపు ఇచ్చింది వైఎస్సార్సీపీయే
  • విజయవాడలో 206 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయడం సీఎం మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం

08:32 AM, Jan 20, 2024
చంద్రబాబు బెయిల్‌ రద్దు కేసు విచారణ వాయిదా

  • కౌంటరు దాఖలుకు సమయం కోరిన చంద్రబాబు తరఫు న్యాయవాది
  • విచారణ ఫిబ్రవరి 12కి వాయిదా  
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను వాయిదా
  • ఈ కేసులో  52 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబు
  • కంటి చికిత్స, ఇతర ఆరోగ్య సమస్యలున్నాయంటూ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
  • చంద్రబాబుకు అక్టోబర్‌ 31న తాత్కాలిక బెయిల్‌
  • ఆ తర్వాత నవంబర్‌ 20న తాత్కాలిక బెయిల్‌ను రెగ్యులర్‌ బెయిల్‌గా మారుస్తూ ఆదేశాలు
  • దీనిపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం
  • నవంబర్‌ 21న సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు
  • బెయిల్‌ రద్దు పిటిషన్‌పై డిసెంబర్‌ 8న జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీష్‌చంద్రల ధర్మాసనం విచారణ
  • జనవరి 19కి వాయిదా వేసిన విషయం తెలిసిందే
  • దీంతో ఈ కేసు విచారణ శుక్రవారం జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ల ధర్మాసనం ముందుకొచ్చింది
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో ఇటీవలే తీర్పు వచ్చింది
  • అధ్యయనం చేయడానికి సమయం పడుతుందని.. కౌంటర్‌ దాఖలుకు సమయం కోరిన బాబు తరఫు న్యాయవాది 
  • దీంతో ఫిబ్రవరి 12వ తేదీకి విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపిన జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం

08:14 AM, Jan 20, 2024
సీఐడీ విచారణకు టీడీపీ నేతలు

  • దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్, ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి శివకేశవ అనుచిత వ్యాఖ్యలు
  •  సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు విచారణ
  • అమరావతి జేఏసీ నాయకులు శ్రీనివాసరావు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు
  • రామ్‌గోపాల్‌వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటన
  • దీనికి అనుబంధంగా షేక్‌ ఫిరోజ్, బండి శివకేశవ ఘాటైన కామెంట్లు
  • కేసు విచారణలో భాగంగా వారిద్దరిని కొన్ని గంటలపాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
  • విచారణలో వారితోపాటు ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు.  

08:03 AM, Jan 19, 2024
రేపు ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు

  • నేడు ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులర్పించనున్న షర్మిల
  • ఆదివారం ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న షర్మిల
  • ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరణ
  • తెలంగాణలో వైఎస్సార్‌టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించిన షర్మిల
  • తన పార్టీ YSRTPని జనవరి 4, 2024న కాంగ్రెస్‌లో విలీనం
  • ఆ తర్వాత చకచకా మారిపోయిన పరిణామాలు
  • షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టేందుకు  APCC చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజును పక్కనపెట్టిన కాంగ్రెస్‌
  • ఇది జరిగిన మరుసటి రోజే షర్మిలను కాంగ్రెస్‌ పెద్దలు ఏపీసీసీ చీఫ్‌గా నియామకం

    ఇదీ చదవండి: AP: పొలిటికల్‌ ట్రాప్‌లో షర్మిల
     

07:18 AM, Jan 20, 2024
రామోజీ ఏడుపు.. పింఛన్లపై వంచన రాతలెందుకు?

  • సీఎం వైఎస్‌ జగన్‌ పాలన పెన్షన్‌ లబ్ధిదారులందరికీ రామరాజ్యమే 
  • చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలతో లబ్ధిదారులకు అష్టకష్టాలు
  • అప్పట్లో నడవలేని స్థితిలో వృద్ధులు, దివ్యాంగులు క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షణ
  • ఆ రోజులే స్వర్ణయుగంగా ఈనాడుకు కనబడిందా?
  • ఒక ఇంటికి ఒకే పెన్షన్‌ అంటూ ఆదేశాలిచ్చిందే బాబు ప్రభుత్వం
  • కానీ, రెండేసి పెన్షన్లు మంజూరు చేసినట్లు ఈనాడు పచ్చి అబద్ధాలు 
  • జగన్‌ పాలనలో వలంటీర్లు ఠంఛన్‌గా 1న ఇంటి వద్దే పంపిణీ
  • సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే పెన్షన్లు మంజూరు
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా రూ.10 వేల చొప్పున మంజూరు
  • గత 55 నెలల్లో 29.51 లక్షల మందికి పెన్షన్లు మంజూరు
  • అయినా.. జగన్‌ విధానాలన్నీ బూటకమంటూ రామోజీ ఏడుపు 

07:05 AM, Jan 20, 2024
రామోజీ.. నీ నీచపు రాతలు చూస్తే జాలేస్తోంది

  • ఆయన కులపోడు సీఎంగా లేడనే విషం కక్కుతున్న రామోజీ 
  • సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం 
  • దళితుల మేలు గిట్టని రామోజీ, బాబు, రాధాకృష్ణ : ఎంపీ నందిగం 
  • ఈనాడు అధిపతికి ప్రజలే బుద్ధి చెప్తారు: ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ 
  • ఈనాడు ప్రతులను తగలబెట్టిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే  
     

07:02 AM, Jan 20, 2024
భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్‌!

  • బడుగుల భూముల్లో పచ్చగద్దల పాగా
  • ప్రభుత్వ భూములూ హాంఫట్‌ 
  • ఏజెంట్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులకు బెదిరింపులు 
  • అమరావతిలో చంద్రబాబు ముఠా అసైన్డ్‌ భూ దోపిడీ 
  • కారుచౌకగా సేల్‌డీడ్ల ద్వారా హస్తగతం 
  • మొత్తం రూ.5 వేల కోట్ల భూముల లూటీ 
  • టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూదాహానికి బడుగు, బలహీన వర్గాల అసైన్డ్‌ భూములు సమిధలు
  • ప్రభుత్వ భూములూ గల్లంతు
  • చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు, సన్నిహితుల హస్తగతం
  • ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ వర్తించే 1,072 ఎకరాల అసైన్డ్‌ భూములు
  • రూ.760.25 కోట్ల ప్యాకేజీ వర్తించే 328 ఎకరాల ప్రభుత్వ భూములు
  • వెరసి భూసమీకరణ ప్యాకేజీ కింద అమరావతిలో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన స్థలాలను చంద్రబాబు, నారాయణలు తమ గుప్పెట పట్టడం నమ్మలేని నిజం
  • సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తులో ఆధారాలతో సహా ఆ భూదోపిడీ బట్టబయలు
  • దీంతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు 

బినామీల ద్వారా అసైన్డ్‌ భూములను కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు.. 

  • నారా చంద్రబాబు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) 
  • నారా లోకేశ్‌  (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
  • పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
  • గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
  • దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
  • ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
  • రావెల కిశోర్‌బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) 
  • తెనాలి శ్రావణ్‌కుమార్‌ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) 
  • గుమ్మడి సురేశ్‌ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) 
  • మండల ఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు (రియల్టర్‌) 
  • మండల రాజేంద్ర (రియల్టర్‌) టకేవీపీ అంజనీకుమార్‌ (రియల్టర్‌) 
  • దేవినేని రమేశ్‌ (రియల్టర్‌) టబొబ్బా హరిచంద్రప్రసాద్‌ (రియల్టర్‌) 
  • హరేంద్రనాథ్‌ చౌదరి (రియల్టర్‌) టపొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్‌) 
  • దోనేపూడి దుర్గాప్రసాద్‌ (రియల్టర్‌)  

అసైన్డ్‌ భూదోపిడీలో నిందితులు 

  • ఏ1 : నారా చంద్రబాబు
  • ఏ2 : పొంగూరు నారాయణ మరో 38 మంది 
  • సెక్షన్లు : ఐపీసీ సెక్షన్లు 420, 506, 166, 167, 217, 120 (బి) రెడ్‌విత్‌ 34, 35, 36, 37లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, అసైన్డ్‌ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం–1977 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు.  
     

06:55 AM, Jan 20, 2024
పెత్తందారీ పోకడలూ అంటరానితనమే: సీఎం జగన్‌

  • కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేడ్కరే స్ఫూర్తి 
  • 77 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా వివక్ష ఇంకా సమసి పోలేదు 
  • రూపం మార్చి.. బరి తెగించిన దురహంకారులు పెత్తందారులు 
  • పేద కులాలు ఎప్పటికీ తమ పనివారుగా, సేవకులుగానే ఉండాలట 
  • చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు 
  • తెలుగు మీడియమే ఉండాలని అంబేడ్కర్‌ అన్నట్టు పెత్తందార్ల పత్రిక వక్రీకరణలు 
  • వారు పాటించే అంటరానితనానికి అబద్ధాలతో అందమైన మేకప్‌ 
  • పేదల చదువులు, ఇళ్లను అడ్డుకుంటున్న దుర్మార్గులు 
  • మన 56 నెలల పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం 
  • మీ బిడ్డ ప్రభుత్వం గ్రామ గ్రామాన మార్పు తీసుకొచ్చింది 
  • 206 అడుగుల ఎత్తుతో ఘనంగా ‘సామాజిక న్యాయ మహా శిల్పం’ ఆవిష్కరణ  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement