సాక్షి, హైదరాబాద్: అధికారం ఉన్నా లేకున్నా చాలా మంది సిద్ధాంతం కోసం పని చేశారని.. అలాంటి రాజకీయాలు తెలంగాణలో మళ్లీ రావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విధానపరమైన లోపాలు ఉంటే ప్రతిపక్షం ఎత్తిచూపాలన్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు రచించిన ‘ఉనిక’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాసాగర్‌రావు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు. సుదీర్ఘకాలం విద్యాసాగర్‌రావు ప్రజా జీవితంలో ఉన్నారు
ఆయన సమర్థతను ప్రధాని గుర్తించారన్నారు.
విద్యార్థి రాజకీయాలలో పనిచేస్తే సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటారు. విద్యార్థి రాజకీయాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. ఎవరి పాత్ర వాళ్లు పోషించాలి. పాలక పక్షం తప్పులను ఎత్తిచూపే హక్కు ప్రతి పక్షాలకు ఉంది. సభలో నేడు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పాలకపక్షం, ప్రతి పక్షం మధ్య ప్రతిష్టంభనను తొలగించడానికి నాడు విద్యాసాగర్ లాంటి వాళ్లు కృషి చేసే వాళ్లు. 11 నెలల్లో ఏ ఒక్క సభ్యుడ్ని బయటకు పంపలేదు. చర్చ సజావుగా సాగాలని మేము సభ్యులను సస్పెండ్ చేయలేదు’’ అని రేవంత్ పేర్కొన్నారు.
‘‘గోదావరి జలాల వినియోగం నాడు విద్యాసాగర్ కృషి చేశారు. గోదావరి జలాల వినియోగం సంపూర్ణంగా పూర్తికాలేదు. విద్యాసాగర్ అనుభవం మనకు అవసరం. తమ్మిడిహట్టి వద్ద భూ సేకరణ కోసం ఎవరి వద్దకైన వెళ్తా.. భేషజాలు నాకు లేవు. 5 ట్రిలియన్ ఏకానమి తీసుకురావాలని లక్ష్యంగా దేశం పెట్టుకుంది. అందులో ఒక ట్రిలియన్ ఏకానమి తెస్తానని చెప్పాను. రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్ అయితేనే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి అవుతుంది. ఆటో మొబైల్ పరిశ్రమలు తేవడానికి సహకరించాలని మోదీని కోరాను. కాజీపేట రైల్వే కోచ్ పనులు వేగవంతం చేయాలని ప్రధానిని కోరాను’’ అని రేవంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment