నన్ను కొట్టిన వాడి చేయి తీసేస్తా.. | Sakshi
Sakshi News home page

నన్ను కొట్టిన వాడి చేయి తీసేస్తా .. టీడీపీ ఎంపీ అభ్యర్థి నోటి దురుసుతనం

Published Sun, Apr 28 2024 12:00 PM

Guntur TDP MP Pemmasani Chandrasekhar said that he would remove the hand that hit him

అమెరికాలో అయితే కాల్చేస్తారు

సద్దాం హుస్సేన్‌ కి పట్టిన గతే పడుతుంది

ఇది అమెరికా నుంచి దిగుమతి అయిన టీడీపీ ఎంపీ అభ్యర్థి

డబ్బుందన్న అహం ఎక్కువ ఉందంటున్న దేశం నేతలు  
 

సాక్షి, గుంటూరు: ‘కొట్టడం అనేది ఎగైనెస్ట్‌ ది లా... పొరపాటున ఎవడైనా చేస్తే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. కొట్టినవాడి చెయ్యి తీసేస్తా.. ఎవడైతే చేశాడో.. ఏదో ఒకరోజు ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో.. వాడు ఎంత చేస్తే అంతకు డబుల్‌ చేస్తా....’  ‘ఇదే అమెరికాలో అయితే కాల్చేస్తారు... ’ ‘వైఎస్సార్‌ సీపీ నాయకులు సద్దాం హుస్సేన్‌లా వ్యవహరిస్తున్నారు. సద్దాం హుస్సేన్‌ కూడా తన ఇష్టారీతిగా వ్యవహరించినందునే బంకర్‌లో దాగి ఉన్నా లాక్కొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారు.’

పై వ్యాఖ్యలు ఎవరో రౌడీనో, గుండానో, చదువుకోని వ్యక్తో చేసినవి కాదు. డాక్టర్‌ చదివి అమెరికాలో వ్యాపారాలు చేసి గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ పలు సందర్భాలలో చేసినవి. రెండు రోజుల క్రితం ఒక పచ్చ మీడియా అధినేతతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక వేళ మీపై కేసులు పెడితే, కొడితే ఏం చేస్తారు అని ప్రశి్నస్తే తనను కొట్టడం చట్టానికి విరుద్దం అని చెబుతూనే తనను కొట్టిన వారిని మాత్రం చెయ్యి తీసేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం గమనార్హం. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పార్లమెంట్‌ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్‌ మొదటి నుంచి డబ్బుందన్న అహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. చంద్రశేఖర్‌ అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు పారీ్టకి చేటు తెస్తున్నాయని వారు అంటున్నారు.

ఇప్పటికే ఆయన తీరుపై కాపు సామాజిక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన గుంటూరు బరిలోకి దిగిన తర్వాత  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కాపు వర్గం నేతకు కూడా సీటు దక్కలేదు. అయినా పార్టీ కోసం పనిచేయడానికి వెళ్లిన వారికి ఛీత్కారాలే ఎదురయ్యాయి. తమ పారీ్టతో పాటు మిత్రపక్షాలలో ఉన్న కాపు నేతలు కూడా కూటమికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ఇంటలెక్చువల్‌ సెల్‌ స్టేట్‌ కో–కనీ్వనర్‌ డాక్టర్‌ టి.వి.రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీని వీడారు. మరికొంత మంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.  

అమెరికాలో రూ.వందల కోట్లు సంపాదించి గుంటూరులో రాజకీయం చేయాలని డిసైడైన చంద్రశేఖర్‌ కనీసం నియోజకవర్గానికి ఏం చేస్తాడో కూడా చెప్పడం లేదు. తాను గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నించిన చంద్రశేఖర్, అనుకోని పరిస్థితుల్లో 2024లో గుంటూరు పార్లమెంట్‌ నుంచి బరిలోకి దిగారు. గెలిస్తేనే ఇక్కడ ఉంటారని, ఓడిపోతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతారని తెలుగుదేశం నేతలు అభిప్రాయపడుతున్నారు. 2014, 2019లో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన గల్లా జయదేవ్‌ను గెలిపిస్తే నియోజకవర్గానికి సేవ చేయకపోగా చివరి నాలుగు సంవత్సరాలు అసలు కనపడకుండా పోయాడు.

వరసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా   ప్రజలకు చేసిందేమి లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకున్నారు. తన వద్ద డబ్బు ఉంది కాబట్టి డబ్బు కుమ్మరించి  గెలవగలననే ధీమా పెమ్మసాని వ్యక్తం చేస్తున్నారు. తనకు భారీ మెజారిటీ వస్తుందంటూ ప్రగల్భాలు పలుకుతుండటం, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుండటంతో అసలుకే ఎసరు వస్తుందన్న భయం తెలుగుదేశం నేతల్లో కనపడుతోంది.

Advertisement
Advertisement