Watch LIVE: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు | Watch Video: CM Jagan Speech At Key Meeting With YSRCP Leaders | Sakshi
Sakshi News home page

Watch LIVE: YSRCP సమావేశంలో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

Published Tue, Feb 27 2024 5:52 PM | Last Updated on Tue, Feb 27 2024 6:50 PM

Watch Video: CM Jagan Speech At Key Meeting With YSRCP Leaders - Sakshi

అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైఎస్సార్‌సీపీ సమాయత్తం అవుతోంది. ఈ క్రమంలో మంగళగిరిలో మంగళవారం సాయంత్రం పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రాబోయే 45 రోజులు కీలకమని.. 57 నెలల కాలంలో చేసిన మంచిని ప్రతీ ఇంటికి తెలియజేయాలంటూ 175 నియోజకవర్గాల నుంచి 2,500 మంది నేతల్ని ఉద్దేశించి సీఎం జగన్‌ అన్నారు.. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

►రేపటి నుంచి 45 రోజులపాటు కీలకం

►మనం చేసిన మంచి పనులు.. చేసే మంచిని ప్రజలకు చెప్పండి.. 

రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యం

చంద్రబాబుకు విశ్వసనీయత లేదు

►2014లో చంద్రబాబు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలిచ్చారు

►సాధ్యపడని హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు

►అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు

చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు నాకు ఇంకా గుర్తుంది

►రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, బంగారం లోన్లు తీరుస్తానన్నాడు

►సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశాడు

►అసలు అమలు సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చాడో చంద్రబాబుకే తెలియాలి

►ఒక హామీ ఒక నాయకుడు ఇచ్చాడంటే దానికి విశ్వసనీయత ఉండాలి

►తప్పుడు హామీలు ఎప్పుడు మనం ఇవ్వలేదు, ఇవ్వం కూడా

►మనం ఏది ఇవ్వగలమో.. అది చెబుతున్నాం

► 99 శాతం హామీలన్నింటిని నెరవేర్చాం

దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ

► మోసం ఎప్పుడూ నిలబడదు

► 2019లో మనం అమలు చేయగలిగే హామీలిచ్చాం

►ప్రజలకు గుర్తుండిపోయేలా 2019 మేనిఫెస్టో తెచ్చాం

► రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 నియోజకవర్గాల్లో విజయం సాధించాం

►మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలరా? అని అడిగారు

►ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరతామని ఆనాడు చెప్పా

►ఇది చెప్పాం .. ఇది చేశాం అని ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నాం

►మన పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందిచాం

కుప్పంలో 93 శాతం కుటుంబాలకు మేలు చేశాం

►కుప్పంలో 87 వేల ఇళ్లు ఉంటే.. 83 వేల ఇళ్లకు మంచి జరిగింది

► కుప్పంలో 45 వేల కుటుంబాలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం

►రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ బటన్‌ నొక్కడం.. పేదల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం

► ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం

► మనం చేసిన మంచి చూసి ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి

►57 నెలల్లో పూర్తి ప్రక్షాళన జరిగింది.. సంక్షేమ పాలన అందించాం

► పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఫించన్‌.. 3 వేలకు చేశాం

► పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందుబాటులోకి తెచ్చాం

► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం అందుబాటులోకి తెచ్చాం

► లంచాలు వివక్ష లేకుండా ప్రతీ ఇంటికి సంక్షేమం అందించాం

► నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం

►దిశ యాప్‌తో మహిళలకు భద్రత కల్పించాం 

►దిశ యాప్‌తో పోలీసులు త్వరగా స్పందిస్తున్నారు

►ఫోన్‌ చేస్తే చాలూ మహిళలకు రక్షణ దొరుకుతోంది

►ఆరోగ్యశ్రీని అత్యుత్తమ స్థాయిలో విస్తరించాం

► లంచాలకు, వివక్షలకు తావు లేకుండా సంక్షేమ పాలన అందించాం

► ఇవాళ జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు

ఓసీల్లో కూడా నిరుపేదలు ఉన్నారు

► పేదలు ఓవైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉన్నారు

జగన్‌ ఎప్పుడూ పేదల వైపే ఉంటాడు

►జగన్‌ గెలిస్తే పేదవాడికి న్యాయం జరుగుతుంది

►మీ జగన్‌ ఉంటే పేదవాడు బాగుపడతాడు

►జగన్‌ ఉంటే లంచాలు లేకుండా బటన్‌లు కొనసాగుతాయి

► జగన్‌ ఉంటేనే విలేజ్‌ క్లినిక్‌లు పని చేస్తాయి

జగన్‌ రాకుంటే మళ్లీ జన్మభూమిలదే రాజ్యమవుతుంది

►45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి

►వైఎస్సార్‌సీపీలో టికెట్ల ఎంపిక దాదాపు పూర్తైంది

► ఇప్పుడు ప్రకటించిన పేర్లే దాదాపుగా ఫైనల్‌ లిస్ట్‌

దాదాపుగా టికెట్లు కన్‌ఫామ్‌ చేసినట్లే

►సంక్షేమం కొనసాగాలంటే జగనే సీఎంగా ఉండాలి

జగన్‌ చేయగలిగింది మాత్రమే చెబుతాడు

►చంద్రబాబు మాత్రం ఎలాంటి అబద్ధం అయినా చెబుతాడు

►చంద్రబాబు మాత్రం తన అవసరాల కోసం ఎవరినైనా మోసం చేస్తాడు

►ప్రతీ ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లలోకి వెళ్లండి

►ప్రతీ ఒక్కరూ ప్రతీ ఇంటికి వెళ్లి జరిగిన మంచిని చెప్పండి

►జరిగిన మంచిని బాగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తాం

►నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశా

►ఇప్పుడు మీ వంతు..చేసిన మంచిని ఓటర్లకు చెప్పండి

►గతంలో 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఈసారి 175కి 175 స్థానాలు గెలవాల్సిందే

►25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే

పేదవాడు బాగుపడాలంటే వైఎస్సార్సీపీ రావాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement