న్యూఢిల్లీ: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఇచ్చిన హామీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని నిలదీశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా ప్రధాని మోదీ కేవలం 75 వేల నియామక పత్రాలను మాత్రమే పంపిణీ చేశారని ఖర్గే పేర్కొన్నారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ విభాగాల్లో 30 లక్షలకుపైగా ఖాళీలున్నాయి. ఇప్పటివరకు మోదీ ఇచ్చింది మాత్రం 75 వేల ఉద్యోగ నియామక పత్రాలే’ అని ఖర్గే ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రత్యక్షంగా పీఎంవో ఆజమాయిషీలో ఉండే సెంట్రల్ సెక్రటేరియట్‌లో 1,600 పోస్టులు ఖాళీగా ఉండడమేంటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment