![కల్యాణ మంటపాన్ని ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/18/17adnk03-260067_mr_0.jpg.webp?itok=AhDFCIyx)
కల్యాణ మంటపాన్ని ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్
అద్దంకి: శృంగేరి శారదా పీఠాధిపతి భారతీతీర్థస్వామి మాతృమూర్తికి జన్మనిచ్చిన మిన్నెకల్లు గ్రామ ప్రజలు ధన్యులని హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ అన్నారు. శృంగేరీ శారదా పీఠాధిపతి భారతీతీర్థ స్వామి మాతృమూర్తి తంగిరాల అనంతలక్ష్మమ్మ జన్మగ్రామం సంతమాగులూరు మండలంలోని మిన్నెకల్లులో ఆమె పేరిట స్మారక కల్యాణ మండపాన్ని నిర్మించారు. ఈ మంటప నిర్మాణానికి గొరిజవోలు కోటేశ్వరరావు, పంగులూరి మస్తాన్‌రావు స్థలాన్ని దానం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా దైవభక్తి కలిగి ఉండాలన్నారు. దైవ భక్తితో శాంతి సౌఖ్యాలు కలుగుతాయని చెప్పారు. మరో ముఖ్య అతిథి రాష్ట్ర శాప్‌నెట్ చైర్మన్, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తరువాత 15వ వేదసభను తంగిరాల దక్షిణామూర్తి నిర్వహించారు. బొల్లినేని రామకృష్ణ, గాడిపర్తి లక్ష్మినారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శారదాపీఠం నుంచి వచ్చిన ఈవో వీఆర్ గౌరీ శంకర్, స్థానిక నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శృంగేరీ పీఠాధిపతి మాత స్మారక కల్యాణ మండపం ప్రారంభం
ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి
కృష్ణమోహన్
![ప్రత్యేక పూజలు చేస్తున్న శాప్‌నెట్ చైర్మన్ చైతన్య 1](https://www.sakshi.com/gallery_images/2023/03/18/17adnk04-260067_mr.jpg)
ప్రత్యేక పూజలు చేస్తున్న శాప్‌నెట్ చైర్మన్ చైతన్య
Comments
Please login to add a commentAdd a comment