రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఒంగోలు విద్యార్థుల సత్తా
ఒంగోలు: రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఒంగోలు విద్యార్థులు సత్తా చాటారు. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉదయం ప్రారంభమై అర్ధరాత్రి దాటేంత వరకు జరిగిన ఈ పోటీల్లో పలు విభాగాలలో ఒంగోలు హైదరీ క్లబ్ సిద్దార్థ కరాటే అకాడమీ విద్యార్థులు బంగారు, వెండి, రజిత పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హాజరవగా, కరాటే అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.మిల్టన్ శాస్త్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రకాశం జిల్లా కార్యదర్శి నల్లూరి మోహనరావు పాల్గొని బంగారు పతకాలు కై వసం చేసుకున్న విద్యార్థులు, వారికి శిక్షణ ఇచ్చిన సిద్దార్థ కరాటే కోచ్‌లు వి.వెంకటేశ్వర్లు, వి.అనిల్, పీవీ సుబ్రహ్మణ్యం, సయ్యద్ శేషావలి, వి.చాంద్‌బాషాలను ప్రత్యేకంగా అభినందించారు.
కుమితే విభాగంలో విజేతలు...
75 కేజీల పురుషుల విభాగంలో ఎం.రామకృష్ణ (బంగారు పతకం), అండర్–21 విభాగంలో కె.యశ్వంత్ (74 కేజీలు–వెండి పతకం), ఎన్.మహేంద్ర (84 కేజీలు–వెండి), కుమితే క్యాడెట్ విభాగంలో జి.మణికంఠ (60 కేజీలు– వెండి), వేదాస్ అఖిల్ (అండర్–10 విభాగం కటా సిల్వర్ మెడల్, టీమ్ కటా గోల్డ్ మెడల్, కుమితే–35 కేజీలు గోల్డ్ మెడల్) విజయం సాధించారు. ఎం.నిఖిల్ సాయి టీమ్ కటా గోల్డ్ మెడల్, అండర్–11 కుమితే 45 కేజీలు గోల్డ్, టీ.వరుణ్‌తేజ్–టీమ్ కటా గోల్డ్, ఆర్.హర్ష–టీమ్ కటా గోల్డ్ మెడల్, ఎస్.గోపిక అండర్–12 విభాగంలో కటా బ్రాంజ్, టీమ్ కటా గోల్డ్ మెడల్, 30 కేజీల కుమితే విభాగంలో గోల్డ్, హార్ణిక 11 సంవత్సరాల విభాగంలో కటా బ్రాంజ్, టీమ్ కటా గోల్డ్, హాసిక అండర్–11 విభాగంలో టీమ్ కటా గోల్డ్ మెడల్, జి.వసుమ అండర్–10 విభాగంలో కటా బ్రాంజ్, హిమజ్ఞ అండర్–13 విభాగంలో కటా బ్రాంజ్, నైనిక అండర్–13 విభాగంలో కటా సిల్వర్ మెడల్‌ను అతిథుల చేతుల మీదుగా కై వసం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment