ఒంగోలు సిటీ: జిల్లాలోని రైతులు తమకు వచ్చిన అనుమానాలను, సందేహాలను, సమస్యలను నివృత్తి చేసుకునేందుకు 85006 80073 నంబర్‌ను సంప్రదించాలని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ యు.భాస్కరరావు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలు రీసర్వేలో వస్తున్న సమస్యలు, అనుమానాలు ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారికి వస్తున్న సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో ఒక ఎక్స్‌పర్ట్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో, సర్వే శాఖ కార్యాలయంలో ఒక ఎక్స్‌పర్ట్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీం పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment