![ఖైదీలకు పండ్లు పంపిణీ చేస్తున్న జడ్జి శుభవాణి - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/3/02mrkp19r-260008_mr.jpg.webp?itok=6togPYuv)
ఖైదీలకు పండ్లు పంపిణీ చేస్తున్న జడ్జి శుభవాణి
మార్కాపురం: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని మార్కాపురం కోర్టు జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శుభవాణి సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక సబ్‌జైలులో ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి శుభవాణి మాట్లాడుతూ.. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నేర ప్రవృత్తిని మానుకోవాలని, జైలు నుంచి విడుదలైన తర్వాత కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించాలని సూచించారు. అనంతరం రిమాండ్ ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కోర్టు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి శుభవాణి
Comments
Please login to add a commentAdd a comment