బాధ్యతలు స్వీకరించిన జిల్లా రిజిస్ట్రార్‌ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన జిల్లా రిజిస్ట్రార్‌

Published Sat, Sep 21 2024 3:00 AM | Last Updated on Sat, Sep 21 2024 3:00 AM

బాధ్య

ఒంగోలు హెడ్‌క్వార్టర్‌ సబ్‌

రిజిస్ట్రార్లతో సమీక్ష

ఒంగోలు సబర్బన్‌: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా ఆళ్ల బాలాంజనేయులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక పాత గుంటూరు రోడ్డులోని జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకుని రిజిస్టర్‌లో సంతకం చేసి విధుల్లో చేరారు. అనంతరం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం డీఐజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు హెడ్‌క్వార్టర్‌ సబ్‌ రిజిస్ట్రార్లు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఒంగోలు జాయింట్‌–1 సబ్‌ రిజిస్ట్రార్‌ చేతల శ్రీనివాసరావు, ఒంగోలు జాయింట్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌ అప్పిరెడ్డి వాసుదేవరెడ్డి, ఆడిట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సుల్తాన్‌బాషా, చిట్స్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ పద్మావతితో జిల్లా రిజిస్ట్రార్‌ బాలాంజనేయులు సమీక్ష నిర్వహించారు. ఒంగోలు కార్యాలయం పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాలతో పాటు ఇతర అన్ని రకాల అంశాలపై సమాచారం రాబట్టారు. అదేవిధంగా ఆడిట్‌ విభాగంలో, చిట్స్‌ విభాగంలోని పలు అంశాలపై సబ్‌ రిజిస్ట్రార్లతో చర్చించారు.

ఎస్సీ రిజర్వేషన్లకు

చంద్రబాబు నిప్పు

దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు

ఒంగోలు టౌన్‌: ఎస్సీ రిజర్వేషన్లకు సీఎం చంద్రబాబునాయుడు వర్గీకరణ నిప్పు పెట్టారని, ఇప్పుడది ఎస్టీ రిజర్వేషన్లకు కూడా అంటుకుందని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 22వ తేదీ స్థానిక అంబేడ్కర్‌ భవనంలో నిర్వహించనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ స్థానిక సమితి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మనువాదులు చేస్తున్న కుట్రలను, బీజేపీ కుతంత్రాన్ని దళితులు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం వైపు కన్నెతి్‌త్‌ చూడకుండా చేసే కుట్రతోనే మోదీ ప్రభుత్వం వర్గీకరణను ముందుకు తీసుకొచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసేందుకు 400 మంది ఎంపీలను గెలిపించాలని మోదీ ఇచ్చిన పిలుపును దళిత బహుజనులు తిరస్కరించారని, ఇప్పుడు అరకొర మెజారిటీతో ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన దుస్థితిలో పడ్డారని చెప్పారు. అందుకే దేశంలో ఉన్న 27 శాతం ఎస్సీ, ఎస్టీల ఐక్యతను దెబ్బతీయాలని పన్నాగాలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ మాలలకే వస్తున్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, ఉద్యోగాలన్నీ మాలలకే వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 27 వేల ఎస్సీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య, దళిత నాయకుడు కాకుమాను రవి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బాధ్యతలు స్వీకరించిన జిల్లా రిజిస్ట్రార్‌ 1
1/1

బాధ్యతలు స్వీకరించిన జిల్లా రిజిస్ట్రార్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement