బావిలో పడి ఆర్టీసీ కండక్టర్ మృతి
పామూరు: ప్రమాదవశాత్తు పొలంలోని బావిలో పడి ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కంభాలదిన్నె గ్రామ సమీపంలోని పొలాల్లోని బావి వద్ద జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుదే వెంకటస్వామి(60) కందుకూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. కాగా గురువారం గుదే వెంకటస్వామి తన అన్న వెంకట నారాయణతో కలిసి అదే గ్రామ సమీపంలోని వారికున్న పొలంలో మొక్కజొన్న మొక్కలు నాటారు. అనంతరం వెంకట స్వామిని..వెంకట నారాయణ నువ్వు ఇంటికెళ్లు..నేను తరువాత వస్తానని చెప్పి పంపించాడు. కొంత సేపటి తరువాత వెంకటనారాయణ అటువైపు రాగా బావి గట్టు పైన చెప్పులు ఉండటాన్ని గమనించి చుట్టుపక్కల చూశాడు. ఎవ్వరూ లేకపోవడంతో అనుమానంతో ఇంటికి ఫోన్‌చేసి వెంకటస్వామి వచ్చాడా లేడా అని వాకబు చేశాడు. కుటుంబసభ్యులు రాలేదని చెప్పడంతో అనుమానం వచ్చి గ్రామస్తులను, ఈతగాళ్లను తీసుకువచ్చి బావిలోకి దించి గాలించగా వెంకటస్వామి మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment