మాజీ సైనికుల పిల్లలకు పీఎం స్కాలర్షిప్లు
ఒంగోలు టౌన్: మాజీ సైనికుల పిల్లలకు ప్రధాన మంత్రి స్కాలర్ షిప్ పథకం–2024–25కు న్యూఢిల్లీలోని సైనిక బోర్డు దరఖాస్తులను ఆహ్వానిస్తుందని జిల్లా సైనిక అధికారి రజనీకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన నిబంధనల ప్రకారం సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులకు మాత్రమే కాకుండా ఇంటిగ్రేటెడ్ బీఏ, బీకాం, బీఎస్సీలతో పాటుగా ఎల్ఎల్బీ, ఇంటిగ్రేటెడ్ బీఎ, బీకాం, బీఎస్సీలతో పాటుగా బీఈడీ కోర్సులభ్యసించే విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. రెండో సంవత్సరం, మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు కేంద్రీయ సైనిక బోర్డు, న్యూఢిల్లీ వెబ్సైట్లో దరఖాస్తులను ఈ నెల 30వ తేద లోగా పంపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment