బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

Published Thu, Nov 28 2024 12:23 AM | Last Updated on Thu, Nov 28 2024 12:50 AM

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి

ఒంగోలు అర్బన్‌: బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు, కష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి అన్నారు. భారత ప్రభుత్వ మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ బాల్య వివాహ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని న్యూఢిల్లీ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. వెబ్‌కాస్ట్‌ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం భవనం నుంచి సూర్యకుమారితో పాటు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బందితో బాల్యవివాహలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఓబులేసు, ఐసీడీఎస్‌ పీడీ మాధురి, వికలాంగు సంక్షేమ శాఖ ఏడీ అర్చన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేయిస్తున్న రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి

సూర్యకుమారి, పక్కన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement