పడగ విప్పిన ర్యాగింగ్ భూతం
యర్రగొండపాలెం: స్థానిక కళాశాలల వద్ద ర్యాగింగ్ పెచ్చరిల్లిపోతుంది. దీంతో విద్యార్థుల మధ్య తరుచూ ఘర్షణలు తలెత్తుతున్నాయి. బుధవారం ఈ ఘర్షణ తారాస్థాయికి చేరింది. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం రోడ్డులో ఉన్న రెండు కళాశాలలకు చెందిన విద్యార్థులు టీడీపీ కార్యాలయాన్ని వేదికగా చేసుకొని ఘర్షణకు దిగారు. ప్రైవేట్ కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఆ కార్యాలయం పరిసరాల్లో సంచరిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రాకపోకలు సాగించే విద్యార్థులను వేధింపులకు గురిచేశారు. వాళ్లు చెప్పినట్లు వినకపోతే మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డారు. కొంతమంది విద్యార్థులు మద్యం మత్తులో తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఆ కార్యాలయం ప్రాంతం రణరంగాన్ని తలపించింది. విషయం తెలుసుకున్న సీఐ సీహెచ్ ప్రభాకరరావు, ఎస్సై చౌడయ్య సంఘటన స్థలానికి చేరి విద్యార్థులను చెదరకొట్టారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని, అవసరమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment