కొర్రపాటివారిపాలెం కొండ పరిశీలన
తాళ్లూరు: మండలంలోని కొర్రపాటివారిపాలెం గ్రామంలోని కొండను తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో ‘కొండను మింగిన అనకొండ’ శీర్షికన ఈ నెల 18 న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా అధికారులు స్పందించారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, స్థానిక తహశీల్దార్ సంజీవరావు గురువారం కొండను పరిశీలించి గ్రామంలో విచారణ చేపట్టారు. కొర్రపాటివారిపాలెం గ్రామ ప్రజల జీవాలకు ఆధారమైన కొండను అక్రమంగా తవ్వేయడంపై గ్రామ ప్రజలతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. పశువులకు ప్రధాన జీవనాధారమైన కొండను అక్రమంగా తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. అయితే గ్రామస్తులు కలుగజేసుకుని పూర్తి స్థాయిలో పరిష్కారం దొరక్కపోతే మా పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని గ్రామస్తులు ఆర్డీఓ ముందు భీష్మించారు. గ్రామప్రజలకు అండగా ఉండి, తగు న్యాయం చేస్తామని ఆర్డీఓ లక్ష్మీప్రసన్న హామీ ఇచ్చారు. దీంతో వారు నిరసన విరమించుకున్నారు. ఆమె వెంట సీఐ వై రామారావు, ఎస్‌ఐ మల్లికార్జునరావు, డీటీ ఇమ్మానియేల్‌రాజు గ్రామస్తులు ఉన్నారు.
యువత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి
● స్టెప్ సీఈఓ పి.శ్రీమన్నారాయణ
ఒంగోలు సిటీ: యువత తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని స్టెప్ సీఈఓ పి.శ్రీమన్నారాయణ అన్నారు. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసం, మాదక ద్రవ్యాల నిర్మూలనపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ ఏడుకొండలు, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment