పేద రోగులకు మెరుగైన వైద్యం అందించండి
దర్శి: ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక ప్రభుత్వం ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సూచించారు. స్థానిక సీహెచ్‌సీలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఆస్పత్రికి వచ్చిన బూచేపల్లి అక్కడ ఓపీ రాయించుకుని ఉన్న రోగులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రి ఆవరణలో మార్చురీ గది నిర్మాణం త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆపరేషన్ థియేటర్ సామగ్రి, బెడ్స్, అత్యవసర మందుల కొనుగోలుకు ఆస్పత్రి ఆవరణలో డోజర్‌తో చదును చేసి పిచ్చి చెట్లు తొలగించేందుకు నిధులు ఖర్చు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో సిబ్బంది ప్రజలకు మంచి సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సుమన్, కమిటీ సభ్యులు సోనార్‌బాబు, జీవీ రత్నం, వైద్యులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీని సందర్శించిన బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment