ఆడిపాడి నవ్వుకున్నారు
సిరిసిల్ల: జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం వేకువజామున 5.30 గంటలకే.. సిద్ధిసమాధి యోగ శిబిరం మొదలైంది. చలిని సైతం లెక్కచేయకుండా.. 120 మంది యోగా శిక్షణలో భాగంగా ఫన్ క్లబ్‌లో పాల్గొన్నారు. ఆడి, పాడి మనసారా నవ్వుకున్నారు. దీని వల్ల శరీరం, మనసు తేలికవుతుందని యోగా శిక్షకులు తెలిపారు. యోగా గురువులు రాజరత్నాకర్, ఆచార్య లింగమూర్తి, రవీంద్ర ఆచార్య, యాద రమేశ్, ఉప్పల శ్రీనివాస్, బత్తుల భూమేశ్, గడ్డం దేవన్న, సందీప్, రణధీర్, పోలుక ఆనంద్, కల్పన, శ్రీదేవి, సుమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment