నేతన్నలకు అండగా నిలిచింది ఎర్రజెండానే
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు, కార్మికులకు అండగా నిలిచింది, నిలిచేది ఎర్రజెండానేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన మూడవ జిల్లా మహాసభల్లో మాట్లాడారు. నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో 15 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి హక్కులు సాధించుకోవాలని కోరారు. నాయకులు పాలడుగు భాస్కర్, స్కైలాబ్‌బాబు, కూరపాటి రమేశ్, మూషం రమేశ్, కోడం రమణ వస్త్రపరిశ్రమ సమస్యలు, కార్మికుల ఇబ్బందులపై మాట్లాడారు. కార్మిక నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, అన్నల్‌దాస్ గణేశ్, శ్రీరాం సదానందం, ప్రశాంత్, నాగరాజు, నర్సన్న, విమల, పద్మ, అరుణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సీపీఎం నాయకులను వస్త్రోత్పత్తిదారుల జేఏసీ నాయకులు తాటిపాముల దామోదర్, ఏనుగుల ఎల్లయ్య, మండల సత్యం సన్మానించారు. మహాసభల సందర్భంగా సిరిసిల్ల వీధుల్లో ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీవో ఆఫీస్ నుంచి బీవైనగర్ షాదీఖానా వరకు ప్రదర్శన సాగింది. పవర్‌లూమ్, మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment