అభివృద్ధికి సహకరించండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి సహకరించండి

Published Fri, Nov 22 2024 12:54 AM | Last Updated on Fri, Nov 22 2024 12:54 AM

అభివృద్ధికి సహకరించండి

అభివృద్ధికి సహకరించండి

● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టించడం మానుకొని అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. గంభీ రావుపేటలో గురువారం విలేకరులతో మా ట్లాడారు. రానున్న కాలంలో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న గ్యారంటీలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా అధిగమిస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. ప్రజా స్వామిక విధానంలో నిరసనలు చేయొచ్చు, కానీ హింసాత్మక సంఘటనలకు పాల్పడడం తగదని సూచించారు. కాళేశ్వరం–9వ ప్యాకే జీ పూర్తి చేయడం, ఎగువమానేరు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలి పారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌, మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ అధికార ప్రతినిధి క టకం మృత్యుంజయం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, పార్టీ మండలాధ్యక్షుడు హమీద్‌, ప్రకాశ్‌, శ్రవణ్‌రావు, అన్నయ్యగౌడ్‌,శ్రీనివాస్‌, బాలయ్య, రాజుగౌడ్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

పరామర్శ

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మామ గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన మాధవరావు ఇటీవల మృతిచెందారు. మాధవరావు దశదినకర్మకు మంత్రి శ్రీధర్‌బాబు హాజరై, వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మండలంలోని లింగన్నపేటలోని వేద పాఠశాలను మంత్రి సందర్శించారు.

రాజన్న ఆలయానికి మహర్దశ

సిరిసిల్లటౌన్‌: అశేష రాజన్న భక్తుల ఆకాంక్ష వేములవాడ ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మహర్దశ తీసుకొచ్చారని కాంగ్రెస్‌ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గురువారం మాట్లాడారు. ఆలయాభివృద్ధికితోపాటు జిల్లాలో వివిధ పనులకు సీఎం రూ.వెయ్యి కోట్ల వరకు మంజూ రు చేశారని కొన్ని పనులు నేరుగా ప్రారంభించారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి జిల్లా సమస్యలు తీసుకెళ్లి నిధులు తీసుకురా వడానికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి కృషి అభినందనీయమన్నారు. ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాసు, భీమారం శ్రీనివాస్‌, కిరణ్‌, కమలాకర్‌రావు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement