కాటన్ వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి
● కరెంటు సబ్సిడీపై సర్కారుకు కృతజ్ఞతలు ● పరిశ్రమ నిలదొక్కుకునే చర్యలు తీసుకోవాలి ● కాంగ్రెస్ వస్త్రోత్పత్తి రంగం జేఏసీ నేతలు
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లలో కాటన్ వస్త్రానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంఘాల జేఏసీ నేతలు కోరారు. ఈమేరకు గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వస్త్రపరిశ్రమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గతంలో సిరిసిల్ల కాటన్ వస్త్రపరిశ్రమకు దేశంలోనే పేరెన్నికై ందన్నారు. ఆర్వీఎం వంటి ప్రభుత్వ ఆర్డర్లు పాలిస్టర్ వస్త్రంతోనే కాకుండా కాటన్ వస్త్రాన్ని కూడా కలిపి ఉత్పత్తులను చేపట్టేలా చూడాలని కోరారు. మహిళలకు ప్రభుత్వ చీరలు ఇస్తామని ప్రకటించిందని వాటితో పాటుగా కాటన్ లంగాలు కూడా ఇస్తే సి రిసిల్లలోని కాటన్, పాలిస్టర్ వస్త్రోత్పత్తి పరిశ్రమలు పూర్తిగా బాగుపడతాయన్నారు. తాము పాలిస్టర్ వస్త్రాల ఆర్డర్లకు వ్యతిరేకం కాదని కాటన్ వస్త్రానికి కూడా ప్రాధాన్యతనిస్తే.. గత సిరిసిల్ల వైభవం పునరావృతమైతుందని కోరారు. ఇందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి సిరిసిల్ల పరిశ్రమలోని కాటన్, పాలిస్టర్ ఉత్పత్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇప్పించాలని కోరారు. గౌడ సురేశ్, యెల్లె దేవదాసు, గాజుల రవి, గౌడ రాజు, గౌడ వాసు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment