
‘జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించండి’
ఇల్లంతకుంట(మానకొండూర్): ఎస్సీ, ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఇల్లంతకుంటకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు బుధవారం ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ సమీం అక్తర్‌కు విన్నవించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బుధవారం కలిసి ఈమేరకు వినతిపత్రం అందించారు. ఇల్లంతకుంట మండల మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ అధ్యక్షుడు మంద రాజు, నాయకులు పసుల వెంకటి, పట్నం మహేందర్, సావనపల్లి శంకర్, బొడ్డు వెంకటేశం, బెజ్జంకి శ్రీను, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వినతిపత్రం అందిస్తున్న ఇల్లంతకుంట
ఎమ్మార్పీఎస్ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment