వణికే చలిలోనూ ఇంటింటికీ పేపర్
చలికాలం ఇంటింటికీ వెళ్లి పేపర్ వేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. మంకీక్యాప్, గ్లౌస్‌లు, స్వెట్టర్స్ వేసుకుని పేపర్లు పంచుతున్నాం. రోజూ సమయానికే పేపర్ రాలేదంటే కస్టమర్లు ఊరుకోరు. పట్టణంలో సుమారు 30 మంది పేపర్‌బాయ్స్ పంపిణీ చేస్తున్నారు.
– ఎల్లె రాజేంద్రప్రసాద్, న్యూస్‌పేపర్ ఏజెంట్
ఉన్ని దుస్తులు ఇవ్వాలి
పారిశుధ్య కార్మికులకు చలికాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. గజగజ వణికే చలిలోనూ వీధులన్నీ శుభ్రం చేయాలి. పొద్దుగాల ఆరు గంటలకే బయటకు వచ్చే జనాలు చలికి 8 గంటల దాకా రావడం లేదు. మేము ఉదయమే విధుల్లో చేరినట్లు లైవ్ ఫొటోస్‌ను అధికారులకు పంపించాలి. చలికాలం కాబట్టి మాకు స్వెట్టర్లు, గ్లౌస్‌లు, మాస్కులు, టోపీలు అందించాలి.
– లోకిని శ్రీనివాస్, జీపీ వర్కర్
Comments
Please login to add a commentAdd a comment