సిరిసిల్లటౌన్: కార్మికులు విధిగా గుర్తింపుకార్డులు తీసుకోవాలని భవన నిర్మాణ సంఘం(సీఐటీయూ) అధ్యక్ష, కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, మిట్టపల్లి రాజమల్లు కోరారు. సిరిసిల్ల లేబర్అడ్డాపై శనివారం మాట్లాడారు. కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా పక్కదారి పడుతున్నాయన్నారు. 55 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. ఎలిగేటి రాజశేఖర్, లింగంపల్లి శ్రీనివాస్, కోల శ్రీనివాస్, పోకల దేవయ్య, కాయితీ హనుమవ్వ, పెయింటర్ బాలవ్వ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment