అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అధికారులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి వివిధ సమస్యలపై 126 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూకు 58, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌కు 11, ఎస్‌డీసీకి 8, ఉపాధి కల్పన శాఖకు 7, ఎంపీడీవో తంగళ్లపల్లికి 6, ఎంపీడీవో బోయినపల్లి, డీఆర్డీవో, సెస్‌కు 4 చొప్పున, విద్యాశాఖకు 3, జిల్లా పంచాయతీ అధికారి, డీఎస్ సీడీవో, జిల్లా వ్యవసాయ అధికారి, ఎంపీడీవో ముస్తాబాద్‌కు 2 చొప్పున, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ ఆఫీస్, మైన్స్, నీటిపారుదల శాఖ, ఎంపీడీవో కోనరావుపేట, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, ఎల్‌డీఎం, జెడ్పీ సీఈవో, డీసీఎస్‌వో, జిల్లా వైద్యాధికారి, డీపీఆర్‌ఈ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ ఒకటి చొప్పున అర్జీలు వచ్చాయి.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
వివిధ సమస్యలపై 126 దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment