ప్రజా‘వాణి’ వినండి
● దరఖాస్తులు సకాలంలో పరిష్కరించండి ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 202 అర్జీలు
సిరిసిల్లటౌన్: ప్రజావాణిలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని, వెంటనే పరిష్కరించాలని సూచించారు. వివిధ సమస్యలపై 202 దరఖాస్తులు వచ్చాయి. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అర్జీలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment