జాతీయస్థాయిలో ఉపాధ్యాయుడి ప్రతిభ
● రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలపై వీడియో ప్రదర్శన
చందుర్తి(వేములవాడ): జాతీయస్థాయిలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో చందుర్తి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మేడికాల అంజయ్య ప్రతిభ చూపారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక, మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యావిధానంపై రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉపాధ్యాయులకు డిసెంబర్ 26 నుంచి ఈనెల 15 వరకు 21 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 79 మంది హాజరుకాగా.. తెలంగాణ నుంచి ఆరుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో జిల్లాకు చెందిన అంజయ్య ఒకరు. ఈ సందర్భంగా అంజయ్య తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం, రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్రం సాధించిన ప్రగతి, సంస్కృతి, సంప్రదాయాలు, మన పండుగలు.. తదితర 30 అంశాలపై 30 నిమిషాల వీడియోను ప్రదర్శించారు. ఇందుకు అంజయ్యకు రూ.25వేల టీచర్ స్కాలర్‌షిప్, ప్రశంసాపత్రం అందజేశారు. వీటిని సీసీఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్‌కుమార్ చేతులమీదుగా అందుకున్నారు.
నియామకం
సిరిసిల్లకల్చరల్: మున్నూరుకాపు సంఘం విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన మాసం రత్నాకర్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు కొండ దేవయ్య, చల్ల హరిశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన వారికి రత్నాకర్ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment